ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో సీఎంలు వీళ్లేనా?.. అగ్ర నాయకత్వం మదిలో ఎవరెవరున్నారంటే..?

ABN, First Publish Date - 2023-12-04T14:17:04+05:30

ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణ మినహా మిగతా 3 రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.

ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణ మినహా మిగతా 3 రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న కమలదళం, కొత్తగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకుగాను ఏకంగా 163 చోట్ల విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. 199 స్థానాలకు పోటీ జరిగిన రాజస్థాన్‌లో 115 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లోనూ సత్తా చాటిన బీజేపీ 54 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది.


అయితే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ తరఫున సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే సీఎం రేసులో ప్రధానంగా ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. గిరిజన వర్గానికి చెందిన నేతను సీఎంగా చేయాలని భావిస్తే విష్ణు దేవ్ సాయ్ ముందు వరుసలో ఉండే అవకాశాలున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన రమణ్ సింగ్ కూడా సీఎం పదవి రేసులో ఉన్నారు. దీంతో అధిష్టానం ఆయన వైపు కూడా మొగ్గుచూపొచ్చు. మహిళా కోటాలో కేంద్ర మంత్రి రేణుకా సింగ్ కూడా సీఎం రేసులో ముందున్నారు. మహిళకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ భావిస్తే రేణుకా సింగ్‌నే పదవి వరించనుంది. అయితే ఓబీసీ కోటాలో అరుణ్ సోవో పేరు కూడా సీఎం రేసులో ఉంది. బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అరుణ్ సోవో మూడు సార్లు ఎంపీగా గెలిచారు.

రాజస్థాన్ విషయానికొస్తే ఇప్పటికే రెండు సార్లు సీఎంగా పని చేసిన వసుంధరా రాజే పేరు వినిపిస్తోంది. కానీ తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరు మహంత్ బాబా బాలక్ నాథ్, ఈయనను చూస్తే ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గుర్తుకువస్తారు. బాబా బాలక్ నాథ్ కూడా అచ్చం యోగీ ఆదిత్యానాథ్ మాదిరిగానే కాషాయ బట్టలు ధరిస్తారు. నెత్తి మీద ఎప్పుడూ కాషాయరంగు తలపాగా కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే యోగి కంటే ఇంకాస్త ఎక్కువగానే ఆయన కాషాయ దుస్తులతో కనిపిస్తుంటారు. రాజస్థాన్‌లో బాలక్ నాథ్ అత్యంత ప్రాచుర్యం పొందారు. ఈయనను రాజస్థాన్ యోగి అని కూడా అంటారు. ఈయన ఓబీసీ కేటగిరీ నుంచి వచ్చారు. యూపీ మాదిరిగానే రాజస్థాన్‌లోనూ బాబా బాలక్ నాథ్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలున్నాయి.

ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్‌సింగ్ చౌహాన్‌నే కొనసాగే అవకాశాలున్నాయి. నిజానికి కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. కానీ తనదైన వ్యూహాలతో వ్యతిరేకతను అధిగమించిన శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. పలు ప్రజాకర్షక పథకాలతో ప్రజల్లో అసంతృప్తిని తగ్గించారు. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ మేనియా కూడా తోడవడంతో బీజేపీ ఘనవిజయం సాధించింది. దీంతో బేజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన శివరాజ్‌ సింగ్ చౌహాన్‌నే మరోసారి ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలున్నాయి. మొత్తానికి బీజేపీ కేంద్ర నాయకత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రులుగా ఎవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.

Updated Date - 2023-12-04T14:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising