ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై యెడియూరప్ప కామెంట్స్

ABN, First Publish Date - 2023-03-30T14:48:43+05:30

తన వయసు 80 సంవత్సరాలు పైబడిందని, అందుకే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

BS Yediyurappa
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప (BS Yediyurappa) చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. బీజేపీ విజేతగా నిలవడం కోసం తాను కృషి చేస్తానని చెప్పారు.

తన వయసు 80 సంవత్సరాలు పైబడిందని, అందుకే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నానని యెడియూరప్ప చెప్పారు. వయసు 80 సంవత్సరాలు పైబడినప్పటికీ తాను ఈసారి మాత్రమే కాకుండా వచ్చేసారి కూడా రాష్ట్రమంతా పర్యటించి, బీజేపీ విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నాయకత్వంలో బీజేపీ (BJP) తిరిగి అధికారాన్ని నిలుపుకుంటుందన్నారు. కాంగ్రెస్ (Congress) నేతలు అవినీతిపరులని, అందుకే 40 శాతం కమిషన్లు అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మే 10న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఈ ఆరోపణలను పట్టించుకోరన్నారు.

కర్ణాటక (Karnataka)లో 224 శాసన సభ స్థానాలు ఉన్నాయి. వీటికి మే 10న ఎన్నికలు జరుగుతాయని, ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

Modi Vs Mamata : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన దీదీ.. వీడియో వైరల్

Lalit Modi Vs Rahul Gandhi : రాహుల్ గాంధీకి లలిత్ మోదీ హెచ్చరిక

Updated Date - 2023-03-30T14:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising