ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress Vs BJP : రాహుల్ గాంధీని దేశం నుంచి వెళ్లగొట్టాలి : ప్రజ్ఞ ఠాకూర్

ABN, First Publish Date - 2023-03-12T11:11:34+05:30

భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ప్రజ్ఞ ఠాకూర్ (Pragya Thakur) శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై

Pragya Thakur, Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భోపాల్ : భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ప్రజ్ఞ ఠాకూర్ (Pragya Thakur) శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత దేశం గురించి విదేశీ గడ్డపై సిగ్గు చేటు అయిన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను దేశం నుంచి వెళ్ళగొట్టాలన్నారు. విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ ఎన్నటికీ దేశభక్తుడు కాలేడని చాణక్యుడు చెప్పాడని, అది నిజమేనని రాహుల్ గాంధీ రుజువు చేస్తున్నారని అన్నారు.

రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌ (Britain)లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (Cambridge University)లో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటు (Parliament)లో ప్రతిపక్షాల మైక్‌లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేకసార్లు ఇలా జరిగిందన్నారు. భారతీయ ప్రజాస్వామిక నిర్మాణంపై కిరాతక దాడి జరుగుతోందన్నారు. దేశంలోని వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కాంగ్రెస్ (Congress), బీజేపీ తీవ్రంగా పరస్పరం విమర్శించుకున్నాయి.

ప్రజ్ఞ ఠాకూర్ శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడినపుడు ఈ విషయాన్ని విలేకరి ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యులను పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని రాహుల్ చెప్పడంపై స్పందించాలని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ, రాహుల్ గాంధీ తల్లి ఇటలీకి చెందినవారు కాబట్టి ఆయన భారతీయుడి కాదని తాము భావిస్తున్నామన్నారు. ఆయన విదేశాలకు వెళ్లి, పార్లమెంటులో మాట్లాడటానికి అవకాశం పొందలేకపోతున్నానని చెప్తున్నారన్నారు. ఇంత కన్నా సిగ్గు చేటు అయిన విషయం మరొకటి ఉండదన్నారు. ఇలాంటివారికి రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదన్నారు. దేశం నుంచి వెళ్ళగొట్టాలన్నారు.

పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా జరిగితే, మరిన్ని మంచి పనులు జరుగుతాయన్నారు. ఎక్కువ మంచి పనులు జరిగితే కాంగ్రెస్‌కు మనుగడ ఉండదన్నారు. కాంగ్రెస్ మనుగడ చివరి దశలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతల మనసు మలినమైపోయిందన్నారు.

ఇవి కూడా చదవండి :

'Railway job' scam: రూ.600 కోట్ల అక్రమ లావాదేవీలు!

Delhi liquor scam case : జైల్లో పెట్టి నా ధైర్యాన్ని దెబ్బతీయలేరు: మనీశ్‌

Updated Date - 2023-03-12T13:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising