ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanatana Dharmam : రాజ్యాంగంలో హిందూ దేవతల చిత్రాలు : బీజేపీ

ABN, First Publish Date - 2023-09-07T18:05:19+05:30

సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా, ఎయిడ్స్, కుష్టు రోగం వంటిదని డీఎంకే నేతలు ఆరోపిస్తుండటంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పందించడం లేదేమని ప్రశ్నిస్తోంది.

న్యూఢిల్లీ : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా, ఎయిడ్స్, కుష్టు రోగం వంటిదని డీఎంకే నేతలు ఆరోపిస్తుండటంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పందించడం లేదేమని ప్రశ్నిస్తోంది. హైందవేతరులను బుజ్జగించే రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. భారత రాజ్యాంగం వ్రాత ప్రతిలో హిందూ దేవతల చిత్రాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తోంది.

బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, భారత రాజ్యాంగం వ్రాత ప్రతిలో హిందూ దేవతల బొమ్మలు ఉన్నాయన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు చిత్రాలు దీనిలో ఉన్నాయని తెలిపారు. దీనిలో మొఘల్ పాలకులు ఔరంగజేబు, బాబర్ వంటివారి చిత్రాలు లేవని, భారత దేశానికి చెందిన రాణీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద వంటివారి చిత్రాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని సోనియా గాంధీని కోరారు. దీని చివర్లో మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంతకాలు చేశారన్నారు.

మన దేశ రాజ్యాంగంలోని చాలా పేజీల్లో హిందూ దేవుళ్ల ఫొటోలు ఉన్నాయి. భారత దేశం అత్యంత సంపన్నమైదని, గొప్ప సంస్కృతితో అలరారిందని చెప్పడం కోసం ఈ చిత్రాలను ముద్రించారు. ప్రాథమిక హక్కులను రాసిన పేజీ పైన శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు కలిసి లంక నుంచి విజేతలుగా తిరిగి వస్తున్నట్లు కనిపిస్తున్న చిత్రాన్ని ముద్రించారు. ఆదేశిక సూత్రాలను రాసిన పేజీలో, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ముద్రించారు. అదే విధంగా హనుమంతుడు, నటరాజు చిత్రాలు కూడా వేర్వేరు పేజీల్లో ఉన్నాయి.

వివాదానికి కారణం

డీఎంకే నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటిదని, వీటిని వ్యతిరేకించలేమని, నిర్మూలించడం ఒక్కటే సరైనదని, సనాతన ధర్మాన్ని కూడా సమూలంగా నిర్మూలించాలని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీని గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలపై దీటుగా, రాజ్యాంగబద్ధంగా, వాస్తవాలు చెప్తూ స్పందించాలని కేంద్ర మంత్రులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. డీఎంకే నేత ఏ రాజా గురువారం మాట్లాడుతూ, ఉదయనిధి స్టాలిన్‌ను సమర్థించారు. సనాతన ధర్మం కుష్టు రోగం, ఎయిడ్స్‌ వంటిదని చెప్పారు.


ఇవి కూడా చదవండి :

Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!

Eradicate Sanatana Dharmam : మోదీపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం

Updated Date - 2023-09-07T18:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising