Tripura Election Result 2023: త్రిపుర ఎన్నికల్లో తిప్ర మోత పార్టీ తలుపు తట్టిన అదృష్టం... బీజేపీ భారీ ఆఫర్...

ABN, First Publish Date - 2023-03-02T14:19:27+05:30

త్రిపుర శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నప్పటికీ తిప్ర మోత పార్టీ మద్దతును బీజేపీ ఆశిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు

Tripura Election Result 2023: త్రిపుర ఎన్నికల్లో తిప్ర మోత పార్టీ తలుపు తట్టిన అదృష్టం... బీజేపీ భారీ ఆఫర్...
Tripura Assembly Elections Results
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : త్రిపుర శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నప్పటికీ తిప్ర మోత పార్టీ మద్దతును బీజేపీ ఆశిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తే ఆ పార్టీ డిమాండ్లన్నిటినీ అంగీకరిస్తామని చెప్తోంది. అయితే గ్రేటర్ తిప్ర ల్యాండ్ (Greater Tipraland) ఏర్పాటుకు మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి మాణిక్ సాహా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో చాలా స్వల్ప ఆధిక్యత కనబడుతున్న తరుణంలో బీజేపీ ఈ ఆఫర్ ఇచ్చింది.

గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 32 స్థానాల్లో బీజేపీ కూటమి ముందంజలో ఉంది, బీజేపీ 1, ఐపీఎఫ్‌టీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 31 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలియజేయవలసి ఉంటుంది.

తిప్ర మోత పార్టీ 11 స్థానాల్లో ముందంజలో ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాబట్టి తిప్ర మోత పార్టీ మద్దతు లేకపోయినా బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ తిప్ర మోత పార్టీ మద్దతును బీజేపీ కోరుకుంటోంది.

బీజేపీ త్రిపుర శాఖ ప్రధాన అధికార ప్రతినిధి సుబ్రత చక్రవర్తి ఓ వార్తా సంస్థతో గురువారం మధ్యాహ్నం మాట్లాడుతూ, త్రిపురలో తదుపరి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయాన్ని తాము మొదటి నుంచి చెప్తున్నామన్నారు. ఫణీంద్ర నాథ్ శర్మ, సంబిత్ పాత్రా కేంద్ర పార్టీ పరిశీలకులుగా ఇక్కడికి వచ్చారని తెలిపారు. మరికొందరు నేతలు గురువారం సాయంత్రానికి రావచ్చునని చెప్పారు.

తిప్ర మోత పార్టీ ఎన్నికల ప్రచారంలో గ్రేటర్ తిప్ర ల్యాండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీని ప్రభావం ప్రజలపై పడింది. దీంతో ప్రత్యర్థుల ఓట్లకు గండి పడింది.

ఐపీఎఫ్‌టీ, బీజేపీ 2018లో ఇదే హామీపై విజయం సాధించాయి. కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఫలితంగా రాజ కుటుంబానికి చెందిన ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దెబ్బర్మ (Pradoyt Kishore Manikya Debbarma) తిప్ర మోత (Tipra Motha) పార్టీని ఏర్పాటు చేశారు. 2021లో జరిగిన త్రిపుర ట్రైబల్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది. త్రిపురలోని గిరిజనుల్లో 90 శాతం మంది ఈ కౌన్సిల్ పరిధిలోనే ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం, త్రిపురలోని అమర్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రంజిత్ దాస్ విజయం సాధించారు. ఆయన సీపీఎం అభ్యర్థి పరిమల్ దేబ్‌నాథ్‌ను 4,500కుపైగా ఓట్ల తేడాతో ఓడించారు.

ఇవి కూడా చదవండి :

Election Results 2023 : మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్ సగం పూర్తయ్యే సరికి బీజేపీ పరిస్థితి...

Tripura Election Result 2023: తిప్ర మోత పార్టీ లేకుండా త్రిపురలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా?

Updated Date - 2023-03-02T14:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!