Share News

BJP state president: లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధంకండి.. పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర చీఫ్ పిలుపు

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:15 PM

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలను కైవసం చేసుకునే దిశలో పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) పిలుపునిచ్చారు.

BJP state president: లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధంకండి.. పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర చీఫ్ పిలుపు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలను కైవసం చేసుకునే దిశలో పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) పిలుపునిచ్చారు. బెంగళూరులోని పార్టీ ప్రధానా కార్యాలయంలో బుధవారం ఆయన నూతన పదాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీయే విజయాలు, వికసిత భారత్‌ కోసం నడుం బిగించిన ప్రధానమంతిర నరేంద్రమోదీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ వైఫల్యం, అక్రమాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు రాష్ట్ర పార్టీలో ఉత్సాహం ఉరకలు వేస్తోందని, కొద్దిపాటి అభిప్రాయభేదాలు ఉంటే చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దేశంలో మోదీ గాలులు బలంగా వీస్తున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా విజయం కోసం శ్రమిద్దామన్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఏర్పడిన పరాజయాలు, పార్టీలో అంతర్గత సమస్యలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పార్టీ పదాధికారులు సునిల్‌కుమార్‌, పి. రాజీవ్‌, ప్రీతం గౌడ, సందీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:15 PM