ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

2024 Lok sabha Elections: బీజేపీ ఇక ఇంటికే: లాలూ జోస్యం

ABN, First Publish Date - 2023-07-30T21:28:19+05:30

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.

పాట్నా: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) బీజేపీ (BJP) తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా (INDIA) గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) జోస్యం చెప్పారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన నివాసంలో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన ఆర్జేడీ విద్యార్థి విభాగం సమావేశంలో లాలూ ప్రసాద్ పాల్గొన్నారు.


బాబా సాహెబ్ అంబేడ్కర్ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ద్వారా బీజేపీకి చరమగీతం పాడాలన్నారు. ప్రతిపక్షాల విపక్ష కూటమి 'ఇండియా' త్వరలో మహారాష్ట్రలో సమావేశమై తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని, దేశం కోసం పోరాడేందుకు అన్నింటినీ వదులుకుని ముందుకు రావాలని పార్టీ యువజన విభాగానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సా 26 ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి మూడో సమావేశం త్వరలో బెంగళూరులో జరుగనుంది. తొలి సమావేశం జూన్ 23న బీహార్ సీఎం నేతృత్వంలో పాట్నాలో జరుగగా, రెండో సమావేశంలో జూలై 17-18 తేదీల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగింది. ముంబై సమావేశానికి కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ పవార్‍ కూటమి ఆతిథ్యం ఇవ్వనుంది.

Updated Date - 2023-07-30T21:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising