ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP-JDS: ఢిల్లీలో కుదిరిన డీల్.. బీజేపీతో పొత్తు పక్కా.. నెలలోనే సీట్ల లెక్క

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:12 PM

రాష్ట్రరాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ(Prime Minister Modi)తో భేటీ అయి డీల్‌ కుదుర్చుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పక్కా కుదుర్చుకున్నారు.

- హస్తినలో దేవెగౌడ కుటుంబం

- ప్రధానితో ప్రత్యేక భేటీ

- మాజీ ప్రధానికి అరుదైన గౌరవం

- మోదీ వ్యూహం పైనే సర్వత్రా చర్చలు

- ఉమ్మడిగానే పోటీ చేస్తామన్న మాజీ సీఎం కుమారస్వామి

- రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని వ్యాఖ్యలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రరాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ(Prime Minister Modi)తో భేటీ అయి డీల్‌ కుదుర్చుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పక్కా కుదుర్చుకున్నారు. మరో నెలలో సీట్ల లెక్క తేలనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని ఊహించని ఎదురుదెబ్బ తిన్న జేడీఎస్‌ ఈసారి వ్యూహాత్మకంగా తన రూటు మార్చింది అప్పటి ఎన్నికల్లో తుమకూరులో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ప్రధాని దేవేగౌడ ఇప్పుడు కాంగ్రెస్‌పై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారని రాజకీయ పరి శీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కలసి రాకపోవడం, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఒంటరిపోరుతో చేదు ఫలితాలు రావడంతో దళపతి దేవేగౌడ బీజేపీతో జతకట్టినట్లు రాజకీయ పరిశీలకులు మదింపు వేస్తున్నారు. ఢిల్లీలో దేవేగౌడ కుటుంబానికి చెందిన ప్రముఖులంతా దాదాపు ప్రధానితో భేటీ కావడాన్ని చూస్తే బీజేపీతో పొత్తు విషయంలో వీరంతా గట్టి పట్టుతోనూ ఉత్సాహంతోనూ ఉన్నట్లు కనిపిస్తోంది.

కొనసాగుతున్న ఉత్కంఠ

బీజేపీతో పొత్తు ప్రధాని సమక్షంలోనే పక్కా కావడంతో ఇప్పుడు సీట్ల కేటాయింపుపై చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ ప్రధాని దేవేగౌడ వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతారా...? ఒకవేళ అదే జరిగితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు..? మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తారా..? ఇదే నిజమైతే ఆయన చిక్క బళ్ళాపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా..? అనే ప్రశ్నలు కుతూహలం రేకెత్తిస్తున్నాయి. జనవరి చివరికల్లా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, ప్ర ధాని మోదీతో భేటీ అనంతరం మీడియాతో వెల్లడించారు. బీజేపీతో పొత్తు దరిమిలా రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మా రిపోతాయని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై బీజేపీ, జేడీఎస్‌లు కలసికట్టుగా ఉమ్మడిపోరును సాగిస్తాయన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తున్నా మన్నారు. ఈసారి బీజేపీతో పొత్తు కుదుర్చుకుని ఆ తప్పును సరిదిద్దుకుంటున్నామన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేళ ప్రధాని నరేంద్రమోదీ జేడీఎస్‌ కుటుంబ పాలనపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసిన అంశాన్ని మీడియా ప్రస్తావించగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించేందుకు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని, ఇదే సందర్భంగా తమ పార్టీని నమ్మిన మైనారిటీల ప్రయోజనాలు కాపాడుతామని ఆయన భరోసా ఇచ్చారు.

దేవెగౌడకు అరుదైన గౌరవం

ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోదీ నివాసానికి ఉదయం 11గంటలకు దళపతి దేవెగౌడ సారథ్యంలో జేడీఎస్‌ సీనియర్‌ నేతల బృందం వెళ్లింది. వీరిలో దేవేగౌడ చిన్నకుమారుడైన మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, పెద్ద కుమారుడైన మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, హాసన్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దేవేగౌడను అత్యంత ఆత్మీయంగా ఆహ్వానించిన ప్రధాని మోదీ ఆయనను కుర్చీలో ప్రత్యేకంగా ఆశీనులు చేసి తాను వెనుక నిలబడి భుజంపై చేతులు వేసి అరుదైన గౌరవాన్ని ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాత మైసూరు ప్రాంతం లో ఒక్కలిగ కులస్థులను ఆకర్షించే దిశలో దేవేగౌడకు ప్రధాని అరుదైన గౌరవం ఇచ్చారని భావిస్తున్నారు. దేవేగౌడ కుర్చీలో కూర్చుని ఉండగా ఆయన వెనుక ప్రధాని నరేంద్రమోదీ, దేవేగౌడ భుజాలపై చేతులు వేసిన ఫోటో సోషల్‌మీడియాలో భారీగా వైరల్‌ అయ్యింది. ఒక్కలిగ కులస్థుల ఓట్లను ఆకర్షించేందుకు ఇది ప్లస్‌ పాయింట్‌ కానుందని జేడీఎస్‌ వర్గాలు ఆశాదాయకంగా ఉన్నాయి.

Updated Date - Dec 22 , 2023 | 12:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising