ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget 2023 : సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహానికి ప్రత్యేక ప్యాకేజీ

ABN, First Publish Date - 2023-02-01T12:09:40+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు.

Nirmala Sitharaman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీరు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి, మరింత విస్తరించడానికి, జనబాహుళ్యానికి తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ప్రతిపాదించినట్లు నిర్మల తెలిపారు.

కృత్రిమ మేధాశక్తిని దేశం కోసం ఉపయోగించుకోవడం కోసం 3 కృత్రిమ మేధాశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రకటించారు.

ప్రజలకు అవకాశాలను కల్పించి, వృద్ధిని ప్రోత్సహించడంపై ఈ బడ్జెట్‌లో దృష్టిపెట్టినట్లు తెలిపారు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, బలోపేతం, ఉద్యోగాల సృష్టిపై దృష్టిసారించినట్లు తెలిపారు.

ఫైనాన్షియల్ సెక్టర్‌ను బలోపేతం చేయడం, టెక్నాలజీ చోదక, నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే తమ విజన్ అని తెలిపారు.

Updated Date - 2023-02-01T12:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising