Budget 2023 : ‘సప్తరుషి’... ఈ బడ్జెట్‌లో 7 ప్రాథమ్యాలు : నిర్మల సీతారామన్

ABN, First Publish Date - 2023-02-01T11:43:36+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు.

Budget 2023 :    ‘సప్తరుషి’... ఈ బడ్జెట్‌లో 7 ప్రాథమ్యాలు : నిర్మల సీతారామన్
Nirmala Sitharaman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ బడ్జెట్‌లో ఏడు ప్రాథమ్యాలు ఉన్నాయన్నారు. సమ్మిళిత అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా సత్ఫలితాలు అందడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల వృద్ధి, ప్రజల శక్తి, సామర్థ్యాలను వినియోగించుకోవడం, హరిత వృద్ధి, యువ శక్తిని ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వంటివాటిపై దృష్టి సారించినట్లు తెలిపారు.

నిర్మల సీతారామన్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు :

- వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు

- వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం, వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.

- రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు. పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం.

- ఆత్మ నిర్బర్ భారత్ క్లీన్ పథకం ఉద్యానవన పంటలకు చేయూత.

- చిరుదాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం 'శ్రీఅన్న' పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటల ప్రోత్సాహం.

- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్

- అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్

- వృద్ధి రేటు 7% గా అంచనా వేస్తున్నాం

- ఇంత వృద్ధిరేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనదే

- తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపైంది

- ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాం

- కోవిడ్-19 సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాం

- ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇంకా కొనసాగుతోంది

- 100 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందించాం

- భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది

- గ్రీన్ డెవలప్మెంట్ దిశగా అనేక విధానాలు రూపొందిస్తున్నాం

- సామాన్యుల సాధికారితకు ఈ బడ్జెట్ తోడ్పడుతుంది

- సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించాం

- 2047నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం లభించి వందేళ్లు పూర్తవుతుంది. ఆ విజన్ లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాం.

Updated Date - 2023-02-01T12:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising