ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka : కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం... కారులో తరలిస్తున్న నగదు కట్టల పట్టివేత...

ABN, First Publish Date - 2023-04-06T10:33:11+05:30

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రతి

Karnataka
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగదు, మద్యం వంటివాటిని అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరోధించేందుకు ఎన్నికల సంఘం, స్థానిక అధికారులు సంయుక్తంగా పని చేస్తున్నారు.

కర్ణాటకలోని గడగ్ జిల్లా (Gadag district), డుండుర్ చెక్ పోస్ట్ (Dundur check post) వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఓ వాహనంలో రూ.50 లక్షలు దొరికినట్లు పోలీసులు గురువారం తెలిపారు. కారులోని వ్యక్తులు ఈ నగదుకు సరైన ఆధారాలను చూపలేదని తెలిపారు. ఈ సొమ్ము ఎవరిదో రుజువు చేయగలిగే స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కర్ణాటక శాసన సభ ఎన్నికలు (Karnataka Assembly Polls) మే 10న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 224 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

UK PM Rishi Sunak : ‘పద్మ’ పురస్కార ప్రదానోత్సవంలో అందరినీ ఆశ్చర్యపరచిన రిషి సునాక్ సతీమణి అక్షత

Updated Date - 2023-04-06T10:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising