ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament : ఈ నెల 19న కేంద్రం అఖిల పక్ష సమావేశం.. ఆ కీలక బిల్లుపై చర్చ కోసమేనా..?

ABN, First Publish Date - 2023-07-06T13:25:27+05:30

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code - UCC) బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code - UCC) బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Monsoon Session Of Parliament) ఈ నెల 20 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో యూసీసీతోపాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టవచ్చు.

యూసీసీని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనిని కాంగ్రెస్, డీఎంకే వ్యతిరేకిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ, ఆ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మతం గురించి మాట్లాడటం బీజేపీకి అలవాటు అయిపోయిందని దుయ్యబట్టారు.

యూసీసీపై జూలై 3న జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాయి. బీఆర్ఎస్ ఎటువంటి వైఖరిని వెల్లడించలేదు. బీఎస్‌పీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ దీనికి మద్దతు పలుకుతున్నాయి. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన స్పందిస్తూ మొదట లా కమిషన్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేసింది. బీజేపీ నేత, పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు, అధికరణ 371 ప్రకారం వీరికి రక్షణ ఉందని తెలిపారు. యూసీసీపై లీగల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్, లా కమిషన్ అభిప్రాయాలను ఈ ప్యానెల్ స్వీకరించింది.

ఇవి కూడా చదవండి

Canada : ‘ఖలిస్థాన్’పై కెనడా నేతలు మౌనం.. భారత దౌత్యవేత్తలకు భద్రత ఏర్పాట్లు..

Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్

Updated Date - 2023-07-06T13:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising