ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Assembly Elections: నక్సలైట్ల బాంబు దాడి.. పోలింగ్ విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలు

ABN, First Publish Date - 2023-11-07T09:09:50+05:30

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నక్సలైట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పేలుళ్లలో పోలింగ్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్ గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నక్సలైట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పేలుళ్లలో పోలింగ్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్ గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా తెలిపారు. గాయపడిన జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గల నక్సలైట్ల ఉనికికి పేరుగాంచిన తొండమార్క ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఈ ఘటన జరిగింది. సీఆర్పీఎఫ్, కమాండో బెటాలియన్స్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) 206వ బెటాలియన్‌తో కూడిన జాయింట్ టీమ్ పోలింగ్ భద్రత కోసం పనిచేస్తోంది. తొండమార్క క్యాంపు నుంచి ఎల్మగుండ గ్రామం వైపు ఏరియా డామినేషన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో కోబ్రా 206వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ ప్రమాదవశాత్తూ నక్సలైట్లు అమర్చిన ఐఈడీని పేలుళ్లలో గాయపడినట్లు చెప్పారు.


కాగా 90 అసెంబ్లీ స్థానాలు గల ఛత్తీస్‌గఢ్‌లో నేడు 20 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 12 ఎస్టీ స్థానాలు, ఒక ఎస్సీ స్థానం ఉన్నాయి. ఇందులో 10 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ఎస్టీ స్థానాలైన మొహలా-మాన్‌పూర్‌, అంతగఢ్‌, భానుప్రతాప్‌పూర్‌, కాంకేర్‌, కేశ్‌కాల్‌, కొండగావ్‌, నారాయణపూర్‌, దంతేవాడ, బీజాపూర్‌, కోంటా సీట్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వీటిలో ఖైరాఘర్, డొంగర్‌ఘర్, రాజ్‌నంద్‌గావ్, డొంగర్‌గావ్, ఖుజ్జీ, పండరియా, కవర్ధా బస్తర్, జగదల్‌పూర్, చిత్రకోట్‌ నియోజకవర్గాలున్నాయి.

Updated Date - 2023-11-07T09:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising