ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Stalin: బెంగళూరు భేటీలో సీఎం స్టాలిన్‌ సందడి.. ప్రత్యేకంగా మాట్లాడిన సోనియా

ABN, First Publish Date - 2023-07-19T10:34:16+05:30

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపడమే లక్ష్యంగా బెంగళూరులో మంగళవారం సమావేశమైన ప్రతిపక్ష నేతల భేటీలో ముఖ్యమం

- తన పక్కనే కూర్చోబెట్టుకున్న రాహుల్‌

- పలువురు జాతీయ నేతలతో వేర్వేరుగా భేటీ

- ఈడీ దాడులపై ఆగ్రహం

- గట్టిగా పోరాడాలని సూచన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపడమే లక్ష్యంగా బెంగళూరులో మంగళవారం సమావేశమైన ప్రతిపక్ష నేతల భేటీలో ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేసిన విందులో పాల్గొనేందుకు సోమవారం పయనమై వెళ్ళిన స్టాలిన్‌.. అక్కడే బస చేశారు. విందు సందర్భంగా సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌(Sonia, Mallikarjuna Kharge, Rahul), వామపక్షాల నేతలు డి.రాజా, సీతారాం ఏచూరి, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‎కుమార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తదితరులు స్టాలిన్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. ఈ సందర్భంగా తమిళనాడులో జరుగుతున్న వరుస ఈడీ సోదాలపై ఆరా తీసిన నేతలు.. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం చేస్తూనే, స్టాలిన్‌ను ఓదార్చారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నందునే ఈడీని ఉసిగొల్పుతున్నారని, అయినా వెనక్కి తగ్గవద్దని స్టాలిన్‌కు ధైర్యం నూరిపోశారు. మంగళవారం జరిగిన విపక్షాల సమావేశంలో రాహుల్‌గాంధీ స్టాలిన్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. సమావేశంలో తన పక్కనే కూర్చోబెట్టుకోవడంతో పాటు పలుమార్లు ఆయనతో ముచ్చటిస్తూ కనిపించారు. సమావేశంలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ... ప్రతిరాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మధ్య కనీస ఉమ్మడి కార్యాచరణను కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రతిపక్షాలపై అదే పనిగా దాడులు నిర్వహిస్తుండటం గర్హనీయమన్నారు. ప్రతిపక్ష నేతల సమావేశాలు జరిగినప్పుడల్లా ఈడీ దాడులు చేయడం ఆనవాయితీగా పెట్టుకుందని విరుచుకుపడ్డారు. ఈడీ దాడులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించ బోవన్నారు. ఇటీవల జరిగిన పట్నా సమావేశానికి ముందు కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారని, ప్రస్తుతం బెంగళూరులో ప్రతిపక్ష నేతల రెండో విడత సమావేశానికి ముందు కూడా ఈడీ తమ రాష్ట్రానికి చెందిన మంత్రి పొన్ముడిని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తోందన్నారు. ఈడీ దాడులకు డీఎంకే మంత్రులు, నేతలు ఎవరూ కూడా భయపడే ప్రసక్తేలేదని, ఎన్ని తనిఖీలు జరిగినా చట్టప్రకారం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Updated Date - 2023-07-19T10:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising