కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah Chess: మంచి ఎత్తుతో సంతృప్తి పడకండి, మెరుగైన ఎత్తు కోసం చూడండి

ABN, First Publish Date - 2023-12-10T19:14:08+05:30

మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసి ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన మనుమరాలితో చెస్ ఆడుతున్న ఒక ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.దీనిపై కేరళ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం మరింత రసవత్తరంగా మారింది.

Amit Shah Chess: మంచి ఎత్తుతో సంతృప్తి పడకండి, మెరుగైన ఎత్తు కోసం చూడండి

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో బీజేపీ(BJP) విజయకేతనం ఎగురవేసి ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్‌షా (Amit shah) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన మనుమరాలితో చెస్ (Chess) ఆడుతున్న ఒక ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. దానికి అంతకంటే ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టారు. ''మంచి ఎత్తుతో సంతృప్తి పడకండి, మెరుగైన ఎత్తు కోసం చూడండి'' అని హోం మంత్రి రాశారు. దీనిపై కేరళ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం మరింత రసవత్తరంగా మారింది.


తెల్లపావులపై తెల్లపావులా?

అమిత్‌షా ఇన్‌స్టా పోస్ట్‌పై కేరళ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అమిత్‌షాను బీజేపీ చాణుక్యుడిగా పోలుస్తూ, ఆయన తెల్లపావులపై తెల్లపావులను కదుపుతున్నాడంటూ పోస్ట్ చేసింది. ఫోటో ఎంత క్యూట్‌గా ఉందని ఓ ఎత్తుపొడుపు విసిరింది. దీనిపై 'ట్విటర్' ఒక చిన్న రీడర్ కాంటెక్ట్ పెట్టడంతో కొందరు దీనిపై వివరణ ఇచ్చారు. పావులు నలుపు, తెలుపు రంగుల్లో మాత్రమే ఉండాలని లేదని, షా ఫోటోలో కాస్త ఎల్లో‌వైట్ షేడ్ ఉన్న పావులు, మరోవైపు పూర్తి తెలుపు పావులు ఉన్నాయని వారు క్లారిటీ ఇచ్చారు. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి, కాంగ్రెస్ బహుశా అమిత్‌షో ఫోటోను పరిహసించాలనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోందని, ఇది ఆ పార్టీ దుస్థితిని చెప్పకనే చెబుతోందన్నారు. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని వారు ఎత్తిచూపుతూ, కాంగ్రెస్‌ నిక్‌నేమ్‌లు పెట్టే బదులు ఎన్నికల్లో గెలుపుపై దృష్టిసారిస్తే బాగుంటుందని హితవు చెప్పారు.

Updated Date - 2023-12-10T19:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising