ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress : విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ వీర విహారం

ABN, First Publish Date - 2023-03-03T13:23:36+05:30

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) విదేశీ గడ్డపై విజృంభించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం

Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లండన్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) విదేశీ గడ్డపై విజృంభించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (Cambridge University)లో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత మూలాధారం పరిధి తగ్గిపోతోందని, భారతీయ ప్రజాస్వామ్యపు మౌలిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆరోపించారు. తనపై నిఘా పెట్టడం కోసం ప్రభుత్వం పెగాసస్‌ (Pegasus) సాఫ్ట్‌వేర్‌ను వాడుతోందని ఆరోపించారు.

కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ (Cambridge Judge Business School)లో 21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం (Learning to Listen in the 21st Century)పై రాహుల్ గాంధీ విజిటింగ్ ఫెలో (Visiting Fellow)గా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘భారతీయ ప్రజాస్వామ్యం దాడికి గురవుతోంది. ప్రజాస్వామ్యంపై దాడిని నిరోధించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. నా ఫోన్‌లో కూడా పెగాసస్ ఉంది. తమ ఫోన్లలో పెగాసస్ ఉన్న రాజకీయ నాయకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఫోన్‌లో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని నాకు చెప్పారు’’ అని చెప్పారు.

మీడియా, న్యాయవ్యవస్థలను ప్రభుత్వం నియంత్రిస్తోందని, కబ్జా చేస్తోందని రాహుల్ ఆరోపించారు. మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులు, నిఘా, బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. అసమ్మతిని అణగదొక్కుతోందని ఆరోపించారు.

రాహుల్ వారం రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా బిగ్ డేటా అండ్ డెమొక్రసీ, భారత్-చైనా సంబంధాల గురించి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మాట్లాడతారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే చాప్టర్‌ సమావేశం, ఇండియన్ డయాస్పోరా కాన్ఫరెన్స్‌లలో కూడా ఆయన పాల్గొంటారు.

ఇదిలావుండగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) సమర్థించారు. బీజేపీ (BJP) స్పందిస్తూ, పెగాసస్ లేదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, రాహుల్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టింది. ఈ వంశపారంపర్య పాలకుడు వరుసగా తప్పులు చేస్తున్నారని మండిపడింది.

ఇవి కూడా చదవండి :

Election Commission: ఒక్క ఓటుకు రూ.5వేలు వెల కడుతున్న ఈరోజుల్లో ఈ పెద్దాయన ఎందుకు గుర్తొస్తున్నాడంటే..

Karnataka : ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో అంత డబ్బా!?

Updated Date - 2023-03-03T13:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!