ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union Budget 2023: గ్రామీణ పేదల ఊసు లేదు, ఎన్ఆర్‌ఈజీఏ మాట లేదు.. కాంగ్రెస్ పెదవివిరుపు

ABN, First Publish Date - 2023-02-01T15:35:13+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ పెదవి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Union Budget 2023)పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ ఉందని, గ్రామీణ పేదల ఊసే లేదని విమర్శించింది.

కేంద్ర బడ్జెట్‌లో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ ఎంఎన్ఆర్‌ఈజీఏ, గ్రామీణ పేద కార్మికులు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం ఊసే లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కొన్ని ప్రాథమిక సందేహాలకు కూడా సమాధానం రాలేదని చెప్పారు. పన్నులు తొలగించడం స్వాగతించే అంశని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. తక్కువ పన్నుల విధానాన్ని తాను బలంగా నమ్ముతానని, టాక్స్ కట్‌ల వల్ల ప్రజల చేతిలో మరింత డబ్బులు ఉంటాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమవుతుందని అన్నారు.

ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని కాంగ్రెస్ నేత కె.సురేష్ అన్నారు. అదానీ, అంబానీ, గుజరాత్‌ ప్రయోజనాలను మాత్రమే కాపాడేలా ఉందని, సామాన్య ప్రజానీకాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహ పరిచిందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. పబ్లిక్ ఆస్తులను 12 నుంచి 15 కంపెనీలకు అమ్ముకోవడం ద్వారా దేశాన్ని దివాళా తీయించడంలో బీజేపీ బిజీగా ఉందని విమర్శించారు. తక్కిన ప్రజలు మాత్రం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతితో అలమటిస్తున్నారని, అలాంటప్పుడు ఆత్మనిర్భర్ భారత్‌కు అర్ధమే లేదని అన్నారు.

నిర్మలా సీతారామన్ ప్రసంగ సమయంలో 'భారత్ జోడో' నినాదాలు..

పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పలువురు 'భారత్ జోడో' నినాదాలు చేశారు. అయితే మంత్రి ఆ నినాదాలను ఖాతరు చేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను ఆ పార్టీ నేత సుప్రియా శ్రీనేత్ సమర్ధించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు సంస్కరణల విషయంలో తమను ఆశీర్వదించాలని ఆర్థిక మంత్రి విజ్ఞప్తి చేశారని, దానికి ప్రతిగానే కాంగ్రెస్ ఎంపీలు భారత్ జోడో నినాదాలు చేశారని చెప్పారు. కాగా, బడ్జెట్ ప్రసంగం సమయంలో భారత్ జోడో నినాదాలా? మీరెలాంటి విపక్షం? అంటూ పలువురు నెటిజన్లు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-02-01T15:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising