ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress UCC meet : అన్ని చట్టాల్లో ఏకరూపత అక్కర్లేదు : కాంగ్రెస్

ABN, First Publish Date - 2023-07-16T12:54:30+05:30

దేశంలోని చట్టాలన్నిటిలోనూ ఏకరూపత ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)పై ముసాయిదా బిల్లును ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత మాత్రమే దానిపై స్పందించాలని నిర్ణయించింది.

Mallikharjun Kharge, Congress Chief
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలోని చట్టాలన్నిటిలోనూ ఏకరూపత ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)పై ముసాయిదా బిల్లును ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత మాత్రమే దానిపై స్పందించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

యూసీసీపై అభిప్రాయాలను తెలియజేయడానికి లా కమిషన్ ఇచ్చిన గడువు ఈ నెల 14తో ముగిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) జూన్ 27న భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, యూసీసీ గురించి ప్రస్తావించారు. ఒకే కుటుంబంలో వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు చట్టాలు వర్తించవచ్చునా? అలాంటి కుటుంబం సజావుగా నడుస్తుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవస్థతో దేశం ఎలా పని చేయగలుగుతుందని అడిగారు. ప్రజలకు ఉమ్మడి హక్కులు ఉండాలని భారత రాజ్యాంగం కూడా చెప్తోందన్నారు.

పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం, ఆస్తుల పంపకాల్లో మతాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం వర్తించాలని బీజేపీ చెప్తోంది. దీనిని కొన్ని పార్టీలతోపాటు మతపరమైన సంస్థలు, ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతత్వంలో ఆ పార్టీ సీనియర్ నేతలు శనివారం రహస్య సమావేశం నిర్వహించారు. ఓ కాంగ్రెస్ నేత మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, యూసీసీపై అంతర్గతంగా ఓ నివేదికను రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అన్ని చట్టాలు ఏకరూపంగా ఉండవలసిన అవసరం లేదని నిర్ణయించారు. ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది, ముస్లింలు, హిందువులకు ఒకే విధమైన సివిల్ చట్టాలు ఏవిధంగా ఉంటాయని నేతలు ప్రశ్నించారు. వ్యక్తిగత చట్టాల్లో కొన్ని మార్పుల గురించి పరిశీలించవచ్చునని పేర్కొన్నారు.

శిరోమణి అకాలీ దళ్ లా కమిషన్‌కు రాసిన లేఖలో యూసీసీని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. యూసీసీకి ఆప్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అదేవిధంగా బీఎస్‌పీ కూడా సానుకూలంగా స్పందించింది. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ యూసీసీని వ్యతిరేకిస్తోంది.

ఇవి కూడా చదవండి :

S Jaishankar : ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు : ఎస్ జైశంకర్

Yamuna Floods : ఢిల్లీలో మళ్లీ కురుస్తున్న వర్షాలు.. యమునా నదిలో ప్రమాద స్థాయి దాటిన నీటి మట్టం..

Updated Date - 2023-07-16T12:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising