ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maharashtra : ‘ఎదగడానికి ఇదే అదను’ అంటున్న కాంగ్రెస్ నేతలు

ABN, First Publish Date - 2023-07-05T13:49:24+05:30

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక రావడంతో మహారాష్ట్రలో అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న శరద్ పవార్‌ (Sharad Pawar)కు సంఘీభావం ప్రకటిస్తూనే, తమ పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక రావడంతో మహారాష్ట్రలో అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న శరద్ పవార్‌ (Sharad Pawar)కు సంఘీభావం ప్రకటిస్తూనే, తమ పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మహారాష్ట్ర తాజా పరిణామాలపై స్పందిస్తూ, అజిత్ పవార్ తిరుగుబాటు వల్ల కొంత ఖాళీ ఏర్పడిందని, దానిని భర్తీ చేస్తూ, కాంగ్రెస్ ఎదగడానికి అవకాశం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయవచ్చునని చెప్పారు.

మంగళవారం జరిగిన కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశానికి హాజరైన హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో రాజ్యాంగ విరుద్ధ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆపరేషన్ లోటస్‌ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారన్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా అలాగే చేస్తారన్నారు.

మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఆదేశాలు, స్క్రిప్ట్ మేరకే మహారాష్ట్రలో రాజకీయ నాటకం జరుగుతోందన్నారు. తాము మహావికాస్ అగాడీ కూటమిలో దృఢంగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నామన్నారు. తాను శరద్ పవార్‌, ఉద్ధవ్ థాకరేలతో మాట్లాడానని చెప్పారు. ఈ ప్రభుత్వ కుళ్లు రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Destination weddings: శివపార్వతులు సత్య యుగంలో పెళ్లి చేసుకున్న చోట పెరుగుతున్న పెళ్లిళ్లు

Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..

Updated Date - 2023-07-05T13:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising