ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joe Biden:యుద్ధ సమయంలో భారీ భద్రత మధ్య జో బైడెన్ కీవ్‌కు రహస్యంగా ఎలా వెళ్లారంటే... రాత్రివేళ చిన్న విమానంలో, రైలులో పర్యటన

ABN, First Publish Date - 2023-02-21T07:56:23+05:30

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ భద్రత మధ్య అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ ఆకస్మిక పర్యటన...

Joe Biden Got To Kyiv
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ (అమెరికా): రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ భద్రత మధ్య అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ ఆకస్మిక పర్యటన సాగింది.(How Joe Biden Got To Kyiv) వాషింగ్టన్ నగరానికి వెలుపల ఉన్న సైనిక విమానాశ్రయం హ్యాంగర్ లో జోబైడెన్ పర్యటన ప్రారంభమైంది. ఆదివారం ప్రపంచ మీడియాకు, వాషింగ్టన్ రాజకీయ నాయకులకు, అమెరికన్ ఓటర్లకు తెలియకుండా జో బైడెన్ అత్యంత రహస్యంగా సీ-32 అని పిలిచే ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 757 విమానంలో(Air Force Boeing 757) పర్యటన సాగింది.(President Joe Biden's surprise visit)

చీకటి పడిన తర్వాత చిన్న విమానంలో, రైలులో నిశ్శబ్ధంగా జో బైడెన్ ప్రయాణం (Darkened Plane, Silent Overnight Train) సాగింది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించిన చిన్న విమానం ఎక్కే ప్రదేశానికి దూరంగా కారు పార్కింగ్ చేశారు.కొద్దిమంది భద్రతా సిబ్బంది, చిన్న వైద్యబృందం, సన్నిహిత సలహాదారులు, ఇద్దరు జర్నలిస్టులతో కలిసి జో బైడెన్ రహస్యంగా ఉక్రెయిన్ దేశంలోని యుద్ధ ప్రాంతానికి వెళ్లారు.

ఇది కూడా చదవండి : Turkey earthquake: టర్కీలో మళ్లీ భారీ భూకంపం...ముగ్గురి మృతి, 213 మందికి గాయాలు

అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా గగనతలం నుంచి నిరంతరం పరిశీలిస్తారు. బైడెన్ చెప్పే ప్రతీ పదాన్ని రికార్డు చేస్తారు. జో బైడెన్ పర్యటనలో ఉక్రేనియన్ రాజధాని వచ్చే వరకు వారి వెంట వచ్చిన జర్నలిస్టుల ఫోన్లను కూడా జప్తు చేశారు.తమతో జోబైడెన్ వార్ జోన్ లో పర్యటిస్తున్న విషయాన్ని జర్నలిస్టులకు కూడా ముందుగా చెప్పకుండా అత్యంత రహస్యంగా ఉంచారు. అమెరికా విమానం ఇంధనం నింపుకోవడానికి వాషింగ్టన్ నుంచి జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లోని యూఎస్ సైనిక స్థావరానికి చేరుకున్నా జోబిడెన్ విమానం నుంచి కిందకు దిగలేదు. ఏడు గంటల పాటు ప్రయాణించిన విమానం పోలాండ్‌కు వెళ్లి ర్జెస్జో-జసియోంకా విమానాశ్రయంలో దిగింది.

రాత్రివేళ వార్ జోన్‌కు ప్రయాణం

ఉక్రేనియన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పోలిష్ రైల్వే స్టేషన్ అయిన ప్రిజిమిస్లీ గ్లౌనీకి వెళ్లినపుడు ఎలాంటి సైరన్‌లు మోగించలేదు.రైలు వద్ద ఆగినప్పుడు స్థానిక కాలమానం ప్రకారం అప్పటికే రాత్రి 9:15 గంటలైంది. ముందుగా రైలులోకి జర్నలిస్టులను ఎక్కించారు.ఉక్రెయిన్ లోకి జో బైడెన్ 10 గంటల వార్ జోన్ పర్యటనలో అత్యంత భద్రత మధ్య రహస్యంగా సాగింది. ఉదయించే సూర్యుడితో పాటు జోబిడెన్ ప్రయాణించిన రైలు కీవ్ నగరంలోకి దూసుకెళ్లింది. మొత్తంమీద అత్యంత రహస్యంగా వార్ జోన్ లో అమెరికా అధ్యక్షుడు సాగించిన పర్యటన ప్రపంచం మొత్తాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

Updated Date - 2023-02-21T08:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising