ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi excise policy case: స్టాలిన్‌కు కేజ్రీవాల్ సంచలన లేఖ

ABN, First Publish Date - 2023-04-15T17:23:14+05:30

ఢిల్లీ మద్యం విధానం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి.

Arvind Kejriwal, MK Stallin
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసు (Delhi excise policy case)లో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal)కు సీబీఐ (Central Bureau of Investigation-CBI) సమన్లను జారీ చేయడంపై అనేక మంది నేతలు స్పందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకే బీజేపీ ఈ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ శనివారం తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (Tamil Nadu chief minister MK Stalin)కు ఓ లేఖ రాశారు.

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi), రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదంలో స్టాలిన్‌కు మద్దతు ప్రకటిస్తూ కేజ్రీవాల్ ఈ లేఖను రాశారు. భారత దేశ ప్రజాస్వామ్యంపై ప్రతి రోజూ దాడులు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఎదుట హాజరు కాబోయే ముందు కేజ్రీవాల్ ఈ లేఖను రాయడం విశేషం. బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కబళించేందుకు, పరిమితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, దాని ప్రతినిధులు చేపడుతున్న చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కృషికి మద్దతిస్తున్నానని తెలిపారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమ కార్యకలాపాలను నిర్దిష్ట గడువులోగా నిర్వహించే విధంగా కాల పరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని ఢిల్లీ శాసన సభలో ప్రవేశపెడతామని చెప్పారు. బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ఫైల్స్‌ను, శాసన సభలు ఆమోదించిన బిల్లులను తమకు నచ్చినంత కాలం నిరవధికంగా తమ వద్ద ఉంచుకుంటున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ పథకాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించారు. గవర్నర్ల తీరు ప్రజా తీర్పును అగౌరవపరచడమేనని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే అత్యున్నతమైనదని తెలిపారు.

సీబీఐ ఆరోపణలు

ఢిల్లీ మద్యం విధానం కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2,600 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. రూ.100 కోట్ల మేరకు ముడుపులు చేతులు మారినట్లు ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు 11 మంది అరెస్టయి, జైలులో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా అరెస్టయి, జైలులో ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఓ దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. ఈ కేసులో సీబీఐ కేజ్రీవాల్‌కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆదివారం ఉదయం తమ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ శనివారం విలేకర్ల సమావేశంలో స్పందిస్తూ, అవినీతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడే సీబీఐ సమన్లు పంపుతుందనే విషయం తనకు తెలుసునని చెప్పారు. మద్యం పాలసీ దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులో తమపై అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలు పెడుతూ, వారిపై ఒత్తిడి పెంచడం ద్వారా తమను ఇరుకునపెట్టేందుకు చూస్తున్నాయని అన్నారు. మద్యం విదానంలో మనీష్ సిసిడియాపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేసిందని, అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇవ్వాలంటూ సాక్షులను చితకబాదుతున్నారని, అవినీతిని నిర్మూలించే గొప్ప విధానం ఇదే కావచ్చునని విమర్శలు గుప్పించారు. తాను ఆదివారం ఉదయం 11 గంటలకు సీబీఐ సమక్షంలో హాజరవుతానని చెప్పారు. అయితే కొన్ని లిక్కర్ కంపెనీలకు అక్రమ ప్రయోజనం కలిగేవిధంగా ఈ విధానాన్ని రూపొందించారనే ఆరోపణలు రావడంతో కొద్ది నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్యం విధానాన్ని రద్దు చేసింది.

కపిల్ సిబల్ స్పందన

రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ (Kapil Sibal) శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కేజ్రీవాల్‌పై సీబీఐ చర్యను తాను ముందుగానే ఊహించానని చెప్పారు. ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై బీజేపీని ఎండగట్టారు. ప్రతిపక్షాలు లేని భారత దేశాన్ని బీజేపీ (BJP) కోరుకుంటోందన్నారు. ఆ పార్టీకి ఎదురు నిలిచే నేతల పరువు, ప్రతిష్ఠలను భంగపరిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేజ్రీవాల్ రాజకీయంగా ఎదుగుతున్నారని, అందువల్ల ఆయనను సీబీఐ పిలుస్తుందని తాను కొద్ది నెలల క్రితం ఓ వ్యాసంలో రాశానని తెలిపారు. గత ఏడాదిలో కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచారని ఆరోపించారు. రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనబెట్టి, ఈ అన్యాయంపై ముక్తకంఠంతో మాట్లాడాలని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నేతలందరిపైనా బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ ముఖ్యమంత్రులను, ఇతర నేతలను ఏ విధంగా బీజేపీ లక్ష్యంగా చేసుకున్నదో మనం చూస్తూనే ఉన్నామన్నారు.

కేజ్రీవాల్ గౌరవనీయుడు : నితీశ్

కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లపై బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) శనివారం స్పందిస్తూ, కేజ్రీవాల్ గొప్ప గౌరవనీయుడని చెప్పారు. ఆయన ఢిల్లీ కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిదానికీ ఆయన సరైన సమయంలో సమాధానాలు చెబుతారన్నారు. ఇటీవల ఢిల్లీలో కేజ్రీవాల్‌ను నితీశ్ కలిసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Delhi Excise Policy: కోర్టుల ముందు అబద్దాలు చెబుతున్న దర్యాప్తు సంస్థలు.. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్

Kejriwal Vs Rijiju : కేజ్రీవాల్‌‌కు కేంద్ర మంత్రి రిజిజు సూటి ప్రశ్న

Updated Date - 2023-04-15T17:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising