ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi liquor scam: జైలులో ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ

ABN, First Publish Date - 2023-03-09T19:55:50+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi liquor policy case) అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (Manish Sisodia) ఈడీ అరెస్ట్ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi liquor policy case) అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (Manish Sisodia) ఈడీ (ED Arrested) అరెస్ట్ చేసింది. ఇదే కేసులో గత మంగళవారమే అతడిని సీబీఐ (CBI) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 45 నిమిషాలపాటు ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ శుక్రవారం వాదనలు జరగనున్నాయి. కాగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచిన విషయం తెలిసిందే.

కాగా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో (Delhi Excise policy case) అరెస్టైన మనీశ్‌ సిసోడియా(Manish Sisodia)కు సుప్రీంకోర్టు(Supreme Court) లో నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టుకు వెళ్లాలని కోర్ట్ సూచించింది. అంతకు ముందు తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సిసోడియా సుప్రీం తలుపు తట్టారు. సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-03-09T20:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising