DK Shivkumar: డీకేకు తృటిలో తప్పిన ప్రమాదం..
ABN , First Publish Date - 2023-05-02T14:49:19+05:30 IST
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఒక గద్ద ఢీకొన్న ఘటన...
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఒక గద్ద (Eagle) ఢీకొన్న ఘటన మంగళవారంనాడు చోటు చేసుకుంది. అయితే, ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ములాబాగిలు (Mulabagilu) వెళ్తుండగా హోసకోటే వద్ద హెలికాప్టర్‌ను పక్షి ఢీకొంది. దీంతో హెచ్ఏఎల్ (HAL) విమానాశ్రయంలో దానిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ గ్లాస్ విరిగిపోగా, డీకే కెమెరామన్ స్వల్పంగా గాయపడ్డారు.
దీనికిముందు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను డీకే మంగళవారంనాడు విడుదల చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, డీకే సిద్ధరామయ్య కూడా ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.3,000, నిరుద్యోగ డిప్లమో హోల్టర్లకు రూ.1.500 చొప్పున నెలవారీ భృతి, కుటుంబంలో పెద్ద అయిన మహిళకు రూ.2,000 ఉపకారం వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈనెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 13న ఫలితాలు వెలువడతాయి.