ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Shivakumar: ట్రబుల్ షూటర్‏కు తెలంగాణ బాధ్యతలు..? అదేగాని జరిగితే..

ABN, First Publish Date - 2023-06-13T13:37:44+05:30

దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి విజయం చేకూర్చడంలో కీలకంగా వ్యవహరిం

- కర్ణాటకలో విజయంతో అధిష్టానం కసరత్తు

- డీకేను కలిసిన తెలంగాణ నేతలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి విజయం చేకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై అధిష్టానం పెద్దలు మరో భారం పెట్టనున్నట్లు తెలిసింది. త్వరలోనే శాసనసభ ఎన్నికలు జరిగే తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా బాధ్యతలను అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దక్షిణాదిలో పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో విజయంతో కొత్త శక్తి వచ్చింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా బీఆర్‌ఎస్‌ పేరిట అటు జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి అధికారంలోకి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించి హైదరాబాద్‌ వెళ్లిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ బహిరంగసభ విజయవంతం కావడంతో పార్టీకి మరింత ఊపు వచ్చింది. ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే విషయంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన డీకే శివకుమార్‌(DK Shivakumar) అటు పార్టీ అధిష్టానానికి కూడా అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అక్కడ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వ్యతిరేకులను మళ్లీ పార్టీలోకి రప్పించే యత్నాలు బెంగళూరు కేంద్రంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర్‌రెడ్డి తదితరులను తిరిగి కాంగ్రెస్ లోకి చేర్చుకునే ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది.

వీరంతా ఇటీవల బెంగళూరులో డీకే శివకుమార్‌ను కలసినట్టు సమాచారం. డీకే రంగంలోకి దిగితే అసమ్మతిని నియంత్రిస్తారనే పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల సైతం తరచూ డీకే శివకుమార్‌ను భేటీ కావడం వెనుక రాజకీయ కోణాలు వినిపిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ(Sonia Gandhi and Rahul Gandhi)తో డీకే శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం సిద్దరామయ్యతో కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా ఎన్నికలకు ముందు ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, భారీ బహిరంగసభలు, గెలుపొందాక ముఖ్యమంత్రి పదవి కోసం పట్టు, ఆపై మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపు వంటి అన్నింటా డీకే శివకుమార్‌ ఓ అడుగు వెనకేసి పార్టీ కోసమే ముందుకెళ్లారు. వీటన్నింటికీ ప్రధాన కారణం దక్షిణాదిన మనుగడలేని కాంగ్రెస్‌ పార్టీకి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ద్వారా ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుపొందాలనేదే అధిష్టానం వ్యూహంగా ఉంది. డీకే రంగంలోకి దిగితే రాజకీయం, ఆర్థికం, అంశాల్లోనూ తిరుగులేకుండా ముందుకెళ్తారు. కర్ణాటక(Karnataka)లో ప్రకటించిన గ్యారెంటీల వంటి పథకాలు తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వదలిచినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-06-18T16:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising