ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajya Sabha polls : మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జూలైలో

ABN, First Publish Date - 2023-06-27T20:54:56+05:30

10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం ప్రకటించింది. జూలై 24న పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గుజరాత్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల్లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం ప్రకటించింది. జూలై 24న పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. 10 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూలై, ఆగస్టు నెలల్లో పదవీ కాలం ముగియబోతున్న రాజ్యసభ సభ్యుల వివరాలు :

1. వినయ్ టెండూట్కర్, గోవా

2. దినేశ్ చంద్ర జెమల్‌భాయ్ అనవడియ, గుజరాత్

3. జుగల్‌సింహ్ మాథుర్, గుజరాత్

4. సుబ్రహ్మణ్యం జైశంకర్, గుజరాత్

5. డెరెక్ ఒబ్రెయిన్, పశ్చిమ బెంగాల్

6. డోలా సేన్, పశ్చిమ బెంగాల్

7. ప్రదీప్ భట్టాచార్య, పశ్చిమ బెంగాల్

8. సుస్మిత దేవ్, పశ్చిమ బెంగాల్

9. శాంత ఛేత్రి, పశ్చిమ బెంగాల్

10. సుఖేందు శేఖర్ రే, పశ్చిమ బెంగాల్

ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ నుంచి గెలిచిన రాజ్యసభ సభ్యుడు జోకిమ్ ఫెలీరో తన పదవికి రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం కోసం కూడా ఉప ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఈ స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్ జూలై 6న విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూలై 13. నామినేషన్ల పరిశీలన జూలై 14న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 17 కాగా, పోలింగ్ జూలై 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూలై 26నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

గుజరాత్ నుంచి గెలిచిన బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యం జైశంకర్, దినేశ్ చంద్ర జెమల్‌భాయ్ అనవడియ, లోఖండ్‌వాలా జుగల్‌సింహ్ మాథుర్‌ల పదవీ కాలం ఆగస్టు 18తో ముగుస్తుంది. గోవా బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్ పదవీ కాలం జూలై 28తో ముగుస్తుంది.

పశ్చిమ బెంగాల్ నుంచి గెలిచిన టీఎంసీ రాజ్యసభ సభ్యులు డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, సుస్మిత దేవ్, శాంత ఛేత్రి, సుఖేందు శేఖర్ రే, కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్యల పదవీ కాలం ఆగస్టు 18తో ముగుస్తుంది.

ఫెలీరో పదవీ కాలం 2026 ఏప్రిల్ 2 వరకు ఉంది. కానీ ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 11న రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి :

Putin Offer: వాగ్నర్ గ్రూప్ సైనికులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే...?

Opposition unity : ప్రతిపక్షాల ఐక్యతపై మోదీ వ్యాఖ్యలు

Updated Date - 2023-06-27T20:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising