ECI: ఈసీ సంచలన నిర్ణయం
ABN, First Publish Date - 2023-02-17T20:28:20+05:30
శివసేన (Shiv Sena) ఉద్ధవ్ వర్గం (Uddhav faction) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)కు ఎన్నికల సంఘం (Election Commission of India) షాకిచ్చింది.
ముంబై: శివసేన (Shiv Sena) ఉద్ధవ్ వర్గం (Uddhav faction) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)కు ఎన్నికల సంఘం (Election Commission of India) షాకిచ్చింది. శివసేన పార్టీ పేరును, గుర్తును (party name Shiv Sena symbol) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికి (Shinde faction) కేటాయించింది. శివసేన సింబల్ అయిన విల్లు, బాణం (Bow Arrow) గుర్తును షిండేకు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున గెలిచిన 55 మందిలో 40 మంది షిండే వెంటే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలకు కలిపి 47,82,440 ఓట్లు పోలవగా, షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు 36,57,327 ఓట్లు దక్కాయి. మొత్తం ఓట్లలో 76 శాతం షిండే వర్గానికి దక్కగా ఉద్ధవ్ వర్గానికి (Uddhav Thackeray faction) చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు 12 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 2018లో శివసేన పార్టీ రాజ్యాంగంలో సవరణలను తమకు చూపించలేదని, అవి తమకు సమ్మతం కాదని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
మరోవైపు ఎన్నికల సంఘం నిర్ణయాన్ని శివసేన తప్పుబట్టింది. వివాదం సుప్రీం కోర్టులో ఉండగానే బీజేపీ ఒత్తిడి కారణంగా షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఎన్నికల సంఘాన్ని విమర్శించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భిన్నంగా స్పందించారు. కొత్త పేరు, కొత్త సింబల్‌తో ప్రజా కోర్టుకు వెళ్తామన్నారు.
2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2019) శివసేన బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ థాకరే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠమనే విషయానికి ఉద్ధవ్ తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సీఎం పదవి కోల్పోవడంతో పాటు మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు శివసేన ఎమ్మెల్యే షిండే జట్టులో చేరిపోయారు. ఉద్ధవ్ ఒంటరివారైపోయారు.
Updated Date - 2023-02-17T20:36:55+05:30 IST