ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ED Raids: మంత్రి, ఎంపీ నివాసంపై ఈడీ దాడులు.. పెద్దఎత్తున కరెన్సీ స్వాధీనం

ABN, First Publish Date - 2023-07-17T20:24:45+05:30

మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని రూ.70 లక్షల రూపాయల నగదు, రూ.10 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి పొన్ముడి (Ponmudy), ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి (Gautham Sigamani) నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారంనాడు దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని రూ.70 లక్షల రూపాయల నగదు, రూ.10 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది. చెన్నైలో పొన్ముడి, ఆయన కుమారుడు ఉంటున్న నివాసంతో పాటు విల్లుపరం జిల్లాలోని వారి స్వగ్రామంలో కూడా ఏకకాలంలో ఈడీ దాడులు జరిపింది.


రాజకీయ కక్షతోనే: స్టాలిన్

కాగా, డీఎంకే మంత్రి, ఎంపీ నివాసలపై ఈడీ దాడులు రాజకీయ కక్షతో జరిపినవేనని ఆ పార్టీ ఆరోపించింది. బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశానికి అడ్డంకులు కలిగిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా దాడులు జరిగాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. డీఎంకే అధికారంలో ఉన్న బలమైన పార్టీ అని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని అన్నారు. ఇటీవలే పొన్ముడిపై ఉన్న రెండు కేసులు కొట్టేశారని, ఈ కేసును కూడా చట్టబద్ధంగానే ఆయన ఎదుర్కొంటారని చెప్పారు.


విల్లుపురం జిల్లాలోని తిరుక్కొయిలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 72 ఏళ్ల పొన్ముడి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన కుమారుడు సిగమణి తమిళనాడులోని కాళ్లకురిచ్చి నియోజవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత రెండు నెలల్లో స్టాలిన్ మంత్రివర్గ సభ్యులపై ఈడీ జరిపిన రెండవ దాడి ఇది. మంత్రి సెంథిల్ బాలాజీపై ఇటీవల ఈడీ దాడులు జరిపి, విచారణ అనంతరం అరెస్టు చేసింది.

Updated Date - 2023-07-17T20:24:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising