Jaishankar: ఆ దేశాలకు చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్
ABN, First Publish Date - 2023-04-02T23:21:18+05:30
పశ్చిమదేశాలకు(West) ఇతరులపై కామెంట్ చేసే దురలవాటు ఉందంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ చురకలంటించారు.
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అనర్హతపై అమెరికా(USA), జర్మనీ(Germany) దేశాలు కామెంట్ చేయడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ (External Affairs Minister S Jaishankar) కన్నెర్ర చేశారు. పశ్చిమదేశాలకు(West) ఇతరులపై కామెంట్ చేసే దురలవాటు ఉందంటూ చురకలంటించారు.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బెంగళూరులో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎస్ జైశంకర్ విలేకరులతో మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల తీరును ఎండగట్టారు. అదే సమయంలో లండన్, కెనెడా, ఆస్ట్రేలియా, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర ప్రాంతాల్లో భారతీయ జెండాను దించేసి ఖలిస్థానీ మద్దతుదారులు ఖలిస్థాన్( Khalistani) జెండాను పెట్టడంపై జైశంకర్ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు చూస్తూ ఊరుకోబోమన్నారు. 2020లో కోవిడ్ సమయంలో సరిహద్దుల వద్ద భారత సైన్యాన్ని, ఎయిర్‌ఫోర్స్ బలగాలను మోహరించారని, సమస్య పరిష్కారమయ్యే వరకూ అవి అలాగే కొనసాగుతాయన్నారు.
Updated Date - 2023-04-02T23:24:07+05:30 IST