Gangester: ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదల

ABN , First Publish Date - 2023-04-27T12:19:35+05:30 IST

ఓ ఐఎఎస్ అధికారి హత్య కేసులో దోషిగా తేలిన గ్యాంగ్ స్టర్ ఆనంద్ మోహన్ గురువారం జైలు నుంచి బయటకు వచ్చారు...

Gangester: ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదల
Gangester,Former Bihar MP Anand Mohan

పాట్నా(బీహార్): ఓ ఐఎఎస్ అధికారి హత్య కేసులో దోషిగా తేలిన గ్యాంగ్ స్టర్ ఆనంద్ మోహన్ గురువారం జైలు నుంచి బయటకు వచ్చారు.(Gangester,Former Bihar MP Anand Mohan) బీహార్ నిబంధనలను తుంగలో తొక్కడంతో హత్య కేసులో దోషిగా తేలిన ఆనంద్ మోహన్ జైలు నుంచి బయటకు వచ్చాడు.( walks out of jail)నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10వతేదీన బలమైన రాజకీయ నాయకుడైన ఆనంద్ మోహన్ విడుదలను సులభతరం చేయడానికి జైలు నిబంధనలను సవరించింది.

ఆనంద్ మోహన్‌తో పాటు మరో 26 మంది ఖైదీల విడుదలకు బీహార్ ప్రభుత్వం ఏప్రిల్ 24 సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది.1994వ సంవత్సరంలో అప్పటి గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్‌ను విడుదల చేయడానికి బీహార్ ప్రభుత్వం తన జైలు మాన్యువల్‌ను సవరించింది. బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ గురువారం తెల్లవారుజామున జైలు నుంచి బయటకు వచ్చారు.

ఇది కూడా చదవండి : West Bengal: రామనవమి హింసపై ఎన్ఐఏ విచారణ...కోల్‌కతా హైకోర్టు ఆదేశం

గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ అయిన జి కృష్ణయ్య, ఐఎఎస్‌ను దారుణంగా హత్య చేసిన దోషులను విడుదల చేయాలనే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల సెంట్రల్ ఐఎఎస్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలను వ్యతిరేకిస్తూ భీం ఆర్మీ ఏక్తా మిషన్ ఇన్ చార్జి అమరజ్యోతి పాట్నా హైకోర్టులో పిటిషన్ వేశారు.

Updated Date - 2023-04-27T12:19:35+05:30 IST