Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ వారికి పాలైనా.. ఆల్కాహాలైనా ఒక్కటే..
ABN , First Publish Date - 2023-07-23T12:22:47+05:30 IST
కాంగ్రెస్ పార్టీ వారికి పాల ధరలు అయినా.. ఆల్కాహాల్ అయినా ఒక్కటేనని కేవలం ఖజానా నింపుకోవడమే ప్రథమ కర్తవ్యమని
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ వారికి పాల ధరలు అయినా.. ఆల్కాహాల్ అయినా ఒక్కటేనని కేవలం ఖజానా నింపుకోవడమే ప్రథమ కర్తవ్యమని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) మండిపడ్డారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ చెవిలో పూలు పెట్టుకుని ప్రజల తలపై ఫ్లవర్పాట్లు పెడతున్నారన్నారు. ఎన్నికలకు ముందు నిత్యావసర ధరలంటూ గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ వారికి ఇప్పుడు ధరలు పెంచరాదని తెలియదా అని మండిపడ్డారు. అన్నభాగ్య పథకం నుంచి ఇచ్చే నగదును పాల ధరల పెంపు ద్వారా వాపసు పొందుతున్నారని ఆరోపించారు. ఆల్కహాల్ ధరల గురించి మాట్లాడలేమన్నారు. ఒక చేతితో ఇచ్చినట్లే ఉందని కానీ మొత్తంతో పాటు మరింత ఎక్కువగానే లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పాల ఉత్పత్తిదారులకు ఇచ్చే ప్రోత్సాహం సంగతి మరిచిపోయారన్నారు. సామాన్యుల జేబుల నుంచి సొమ్ముదోచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.