Kerala: కేరళలో భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ABN, First Publish Date - 2023-09-29T14:58:55+05:30
రళ(Kerala)లో వచ్చే రెండు రోజుల పాటు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
కేరళ: కేరళ(Kerala)లో వచ్చే రెండు రోజుల పాటు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. శుక్రవారం కురిసిన వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో నీరు స్తంభించి ట్రాఫిక్(Traffic Jam)కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని పతనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, మలప్పురం, కోజికోడ్, అలప్పుజా, కొట్టాయం, కన్నూర్, కాసరగోడ్ సహా 10 జిల్లాలకి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.
ఐఎండీ తన ఎక్స్ అకౌంట్ లో “సెప్టెంబర్ 28, 29 తేదీల్లో కేరళలో భారీ నుండి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. చేర్యాల 15 సెం.మీ, వడక్కన్‌చేరి 12 సెం.మీ, తైకాట్టుస్సేరి 12 సెం.మీ, అలప్పుజా 11 సెం.మీ, వైకోమ్ లో 11 సెం.మీ. వర్షపాతం” నమోదైనట్లు పేర్కొంది. వానలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గోవా(Goa)తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం గడిచిన 24 గంటల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పశ్చిమ బెంగాల్(West Bengal)లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గతంలో నివేదించింది. భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం కియోంఝర్, మయూర్‌భంజ్, బాలాసోర్, భద్రక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Updated Date - 2023-09-29T14:58:55+05:30 IST