IIT Director Kamakoti: జాతీయ విద్యా విధానంతోనే నాణ్యమైన విద్య

ABN , First Publish Date - 2023-02-01T07:48:58+05:30 IST

జాతీయ విద్యా విధానంతోనే నాణ్యమైన విద్య అందజేస్తామని జీ20 సదస్సులో చెన్నై ఐఐటీ డైరెక్టర్‌ కామకోటి(Director of Chennai IIT Kamakoti) పేర్కొన్నారు.

IIT Director Kamakoti: జాతీయ విద్యా విధానంతోనే నాణ్యమైన విద్య

- జి20 సదస్సులో ఐఐటీ డైరెక్టర్‌ కామకోటి

ప్యారీస్‌(చెన్నై), జనవరి 31: జాతీయ విద్యా విధానంతోనే నాణ్యమైన విద్య అందజేస్తామని జీ20 సదస్సులో చెన్నై ఐఐటీ డైరెక్టర్‌ కామకోటి(Director of Chennai IIT Kamakoti) పేర్కొన్నారు. తరమణిలోని ఐఐటీ ప్రాంగణంలో మంగళవారం ప్రారంభమైన జి20 విద్యా సదస్సులో జి20 దేశాలకు చెందిన విద్యావేత్తలు పాల్గొన్నారు. కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి సంజయ్‌మూర్తి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సదస్సు ఫిబ్రవరి రెండు వరకు కొనసాగనుంది. తొలిరోజు సదస్సులో ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ డా.కామకోటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విద్యావిధానం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని, నాణ్యమైన విద్యను అందించటమే ఆ విద్యావిధానం ప్రధాన లక్ష్యమన్నారు.

పటిష్ట భద్రత... : ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభమైన జి20 సదస్సులో 29 దేశాలు, 15 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన విద్యాసంస్థలు చెందిన ప్రొఫెసర్లు, ఆర్ధిక నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఈ సదస్సు ప్రశాంత వాతావరణంలో ఉండేలా గ్రేటర్‌ చెన్నై పోలీసు శాఖ ఐఐటీ ప్రాంగణంలో భద్రత కట్టుదిట్టం చేసింది. మరోవైపు ఆస్ట్రేలియా, చైనా, నెదర్లాండ్‌, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, మొరీషియస్‌, సౌతాఫ్రికా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులకు సాయుధ దళాల భద్రత కల్పించారు.

కళ్రాపదర్శనలు...

సదస్సుకు హాజరైన ప్రతినిధులకు భారతీయ, తమిళ సంప్రదాయరీతిలో జానపద కళాకారులు ఘన స్వాగతం పలికారు. సదస్సు ప్రాంగణం వెలుపల కీలుగుర్రం బొమ్మలాట, మైలాట్టం, ఒయిలాట్టం, గరగాట్టం నృత్యాలు చేస్తున్న కళాకారులను విదేశీ ప్రతినిధులు తిలకించి ముగ్ధులయ్యారు.

Updated Date - 2023-02-01T07:48:59+05:30 IST