IMD Yellow Alert: పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు
ABN, First Publish Date - 2023-05-26T09:19:26+05:30
రాబోయే ఐదు రోజుల పాటు ఢిల్లీతోపాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఎలాంటి వేడి వాతావరణం ఉండదని అధికారులు చెప్పారు...
న్యూఢిల్లీ: రాబోయే ఐదు రోజుల పాటు ఢిల్లీతోపాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ (IMD) శుక్రవారం వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఎలాంటి వేడి వాతావరణం ఉండదని అధికారులు చెప్పారు.(No heatwave)ఐఎండీ బీహార్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.ఈ రెండు రాష్ట్రాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు (Rain,thunderstorms)కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.(IMD predicts) శుక్రవారం ఉరుములతో కూడిన వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులు వీచడంతో ఉక్కపోతతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని, మే 30వతేదీ వరకు ఎలాంటి వేడిగాలులు వీచే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఢిల్లీలో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం, తేలికపాటి వర్షం, ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
గత 48 గంటల్లో బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.దీంతో వేడి నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలోని పాట్నా, షేక్‌పురా, నవాడా, జాముయి, వామికి నగర్‌లలో వర్షం కురిసింది.శుక్రవారం ఉదయం 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ బీహార్ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
దక్షిణ బీహార్‌లో శుక్రవారం వరకు, ఈశాన్య బీహార్‌లో ఆదివారం వరకు వర్షాలు కురుస్తాయని అంచనా. హిమాచల్‌లో వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి.హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది, కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు ,విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిర్మౌర్‌లో వాహనాల రాకపోకల కోసం 11 రోడ్లు మూసివేశారు. కులులో మూడు, చంబా, సిమ్లాలో ఒక్కొక్కటి, కాంగ్రాలో ఒక రహదారి మూసివేశారు. మొత్తం 171 ట్రాన్స్‌ఫార్మర్లకు కూడా అంతరాయం ఏర్పడింది.పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసింది.రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం కూడా ఈదురుగాలులు వీచాయి.శుక్రవారం అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
---
Updated Date - 2023-05-26T09:36:10+05:30 IST