ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Canada: ఆధారాలు ఉంటే చూపించండి.. కెనడాకు మరోసారి భారత్ కౌంటర్

ABN, First Publish Date - 2023-09-30T12:59:43+05:30

భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టి కౌంటరిచ్చారు. ట్రూడో ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలుంటే చూపిలాంచాలని అన్నారు.

వాషింగ్టన్: భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టి కౌంటరిచ్చారు. ట్రూడో ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలుంటే చూపిలాంచాలని అన్నారు. ఉగ్రవాదంపై కెనడా ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య అన్న ఆయన దానిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్ మీడియా సమావేశంలో భారత్-కెనడా వివాదంపై స్పందించారు. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తుందన్నారు. అయితే ఆ ఆరోపణలను నిరూపించేందుకు కచ్చితమైన సమాచారం ఉంటే దానిని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తాము తలుపులు మూసుకుని కూర్చొలేదని, కానీ కెనడా ఆ వివరాలు ఇవ్వాలి కదా అని అన్నారు. ఈ అంశంపై ఇరు దేశాల ప్రభుత్వాలు చర్చలు జరిపి, విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని జైశంకర్ చెప్పారు.


నిజానికి కెనడా ప్రభుత్వంతో భారత్ చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా జైశంకర్ చెప్పుకొచ్చారు. అతివాదం, ఉగ్రవాదంపై కెనడా ఉదాసీన వైఖరి ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు. రాజకీయంగా ఉన్న ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో కెనడా అలా వ్యవహరించాల్సి వస్తోందని అన్నారు. భారత్‌లో నేరాలకు పాల్పడిన వారు ప్రస్తుతం కెనడాలో ఉన్నారని, వారిని అప్పగించాలని చాలా సార్లు అభ్యర్థించినా కెనడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందిని ఆయన మండిపడ్డారు. దీంతో భారత వ్యతిరేక శక్తులు, కెనడాలో తమ కార్యాకలపాలు కొనసాగిస్తున్నాయనేది రహస్యమేమీ కాదని జైశంకర్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-30T12:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising