ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IRCTC Website Down: రైలు టికెట్లు బుక్ కావడం లేదు.. రైల్వే శాఖపై ప్రయాణికుల ఆగ్రహం

ABN, First Publish Date - 2023-11-23T14:02:02+05:30

సాంకేతిక లోపం కారణంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకునే ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అయింది. వెబ్‌సైట్ అసలు ఓపెన్ కావడం లేదు. దీంతో ఇ- టికెట్ బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు రైల్వేశాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాంకేతిక లోపం కారణంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకునే ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అయింది. వెబ్‌సైట్ అసలు ఓపెన్ కావడం లేదు. దీంతో ఇ- టికెట్ బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు రైల్వేశాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సాంకేతిక కారణాల వల్ల ఇ- టికెట్ బుకింగ్ తాత్కాలికంగా ప్రభావితమైనట్టు ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు. సాంకేతిక బృందం దీనిపై పని చేస్తుందని, బుకింగ్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే కచ్చితమైన సాంకేతిక సమస్య ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఐఆర్‌సీటీసీ ఓ ట్వీట్ చేసింది. “సాంకేతిక కారణాల వల్ల ఈ-టికెట్ బుకింగ్ తాత్కాలికంగా ప్రభావితమైంది. సాంకేతిక బృందం దీనిపై పని చేస్తోంది. బుకింగ్ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది” అని రైల్వే శాఖ పేర్కొంది.


“మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా ఈ-టికెటింగ్ సర్వీస్ అందుబాటులో లేదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి. రద్దు/ఫైల్ టీడీఆర్ కోసం దయచేసి కస్టమర్ కేర్ నంబర్‌కి కాల్ చేయండి. 14646,0755-6610661 & 0755-4090600 లేదా etickets@irctc.co.inకి మెయిల్ చేయండి" అని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని డౌన్‌టౌన్ సందేశం పేర్కొంది. అయితే ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్ అయినప్పటికీ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. Amazin (అమెజిన్), Moneytrip(మనీట్రిప్), ఇతర B2Cలలో టికెట్లను బుక్ చేసుకోవచ్చని భారతీయ రైల్వే శాఖ తెలిపింది. మరోవైపు ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్ కావడం పట్ల ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-23T14:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising