Tripura Election Result 2023: తిప్ర మోత పార్టీ లేకుండా త్రిపురలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా?
ABN, First Publish Date - 2023-03-02T13:07:58+05:30
త్రిపుర శాసన సభ ఎన్నికల ఫలితాల్లో (Tripura Assembly Elections Results 2023) స్పష్టత అస్పష్టంగా ఉంది. ఈ రాష్ట్రంలో 60 స్థానాలుండగా,
న్యూఢిల్లీ : త్రిపుర శాసన సభ ఎన్నికల ఫలితాల్లో (Tripura Assembly Elections Results 2023) స్పష్టత అస్పష్టంగా ఉంది. ఈ రాష్ట్రంలో 60 స్థానాలుండగా, తాజా సమాచారం ప్రకారం, బీజేపీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. వామపక్షాలు 18 స్థానాల్లోనూ, తిప్ర మోత పార్టీ 9 స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలోనూ ముందంజలో కనిపిస్తున్నారు. తుది ఫలితాలు వెలువడవలసిన నేపథ్యంలో తిప్ర మోత పార్టీ గురించి చర్చ జరుగుతోంది. రాజ వంశీకుడు స్థాపించిన ఈ పార్టీ కింగ్ మేకర్ కాబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజ కుటుంబానికి చెందిన ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దెబ్బర్మ (Pradoyt Kishore Manikya Debbarma) ఏర్పాటు చేసిన తిప్ర మోత (Tipra Motha) పార్టీ త్రిపుర శాసన సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. బీజేపీ-ఐపీఎఫ్‌టీ (BJP-IPFT) కూటమి 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. షెడ్యూల్డు తెగలకు కేటాయించిన 20 స్థానాల్లో ఈ పార్టీ అభ్యర్థులు ప్రారంభంలో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండేవారు. దీంతో అధికార బీజేపీ, వామపక్ష-కాంగ్రెస్ కూటమిని ఈ పార్టీ దెబ్బతీయగలిగింది. ఈ నేపథ్యంలో త్రిపురలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇదిలావుండగా, వామపక్ష పార్టీల నేతలు ఇప్పటికే తిప్ర మోత పార్టీ నాయకత్వంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
Nagaland Assembly Election Results 2023 : నాగాలాండ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్!
Updated Date - 2023-03-02T13:07:58+05:30 IST