Karnataka: మనస్ఫూర్తిగా కాంగ్రెస్ చేరుతున్నా...మాజీ సీఎం జగదీష్ షెట్టార్
ABN, First Publish Date - 2023-04-17T11:00:30+05:30
కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ లింగాయత్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ తీర్థం...
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ లింగాయత్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ తీర్థం స్వీకరించారు.(Congress)మే 10వతేదీన కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నేత అయిన జగదీష్ షెట్టార్(Ex-Karnataka CM Jagadish Shettar) బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనం రేపింది. జగదీష్ షెట్టార్ సోమవారం ఉదయం బెంగళూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షెట్టార్ తో పాటు సీనియర్ బీజేపీ నాయకుడు అమర్ సింగ్ పాటిల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీజేపీని కిందిస్థాయి నుంచి పటిష్ఠం చేసిన తాను ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరానని షెట్టార్ చెప్పారు.(jumping BJP ship) తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, ఏడోసారి కూడా తాను ఎన్నికల బరిలోకి దిగుతానని జగదీష్ షెట్టార్ ప్రకటించారు. సీనియర్ నాయకుడైన తనకు ఈ సారి బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై తాను దిగ్భ్రాంతి చెందానని, తనను బీజేపీ నేతలు ఎవరూ కలవలేదని షెట్టార్ చెప్పారు. ఏప్రిల్ 11వతేదీన బీజేపీ ఇన్ చార్జ్ తనకు ఫోన్ చేసి పిల్లాడిలా తనతో మాట్లాడారని షెట్టార్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి :
దీంతో తాను డీకే శివకుమార్, సిద్ధరామయ్య, సూర్జేవాలా, ఎంబీపాటిల్ ను సంప్రదించానని వారు తనను ఆహ్వానించడంతో మనస్ఫూర్తిగానే కాంగ్రెస్ పార్టీలో చేరానని జగదీష్ చెప్పారు. జగదీష్ చేరికతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చిందని, వివాదాలకు దూరంగా ఉండే షెట్టార్ వల్ల కాంగ్రెస్ పార్టీకి మరిన్ని స్థానాలు గెల్చుకుంటుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. షెట్టార్ చేరికతో కాంగ్రెస్ పార్టీకి కొత్త చరిత్ర పునరావృతం అవుతుందని, తమ పార్టీకి 150 సీట్లు లభిస్తాయని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జే వాలా ట్వీట్ చేశారు.
Updated Date - 2023-04-17T11:00:30+05:30 IST