ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karnataka: సిద్ధూ ప్రభుత్వానికి పొంచి ఉన్న గండం..?

ABN, First Publish Date - 2023-08-14T19:41:34+05:30

కర్ణాటకలో సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందే కుప్పకూలనుందని, 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో సిద్ధరామయ్య (Siddaramaiah) సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందే కుప్పకూలనుందని, 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ (Basanagouda Patil Yatnal) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.


కేంద్ర మాజీ మంత్రి, బిజాపూర్ (విజయపుర సిటీ) ఎమ్మెల్యే అయిన యత్నాల్ బెంగళూరులో సోమవారంనాడు జరిగిన ఓ కార్యక్రంలో మాట్లాడుతూ, 135 సీట్లు గెలిచినప్పటికీ కాంగ్రెస్‌కు నిద్ర పట్టడం లేదని, 30 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే ప్రభుత్వం కుప్పకూలుతుందనే భయంతో ఉందని అన్నారు. ''25 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు.


తన నియోజవర్గమైన విజయపురలో ముస్లిం అధికారులను నియమిస్తున్నారని యత్నాల్ ఆరోపించారు. ముస్లిం అధికారులైనప్పటికీ తాను ఎమ్మెల్యేనని, అధికారులు తన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. హిందువులను అణిచివేసేందుకు ఏ అధికారి ప్రయత్నించినా జనవరిలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే మార్చిలోగా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని చెప్పారు. కర్ణాటక రాష్ట్రం అవినీతికి నిలయంగా మారుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలే స్వయంగా ఆ మాట చెబుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కాంగ్రెస్‌ నేతలు డబ్బుల కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని, ఎన్నికల గ్యారంటీల అమలుకు డబ్బులు వెచ్చిస్తుండటం వల్ల నిధుల కొరత తలెత్తిందని, దీనిపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉందని చెప్పారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్‌లో కుట్ర జరుగుతోందని విపక్ష నేతలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.

Updated Date - 2023-08-14T19:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising