ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KC Venugopal: త్వరలోనే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తాం

ABN, Publish Date - Dec 21 , 2023 | 10:45 PM

పార్లమెంటు ఎన్నికలపై ( Parliamentary Elections ) దృష్టి సారించామని, ఆలస్యం చేయకుండా త్వరలోనే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ( KC Venugopal ) స్పష్టం చేశారు. గురువారం నాడు సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశం గురించి ఆయన మీడియాకు వివరాలు తెలిపారు.

ఢిల్లీ: పార్లమెంటు ఎన్నికలపై ( Parliamentary Elections ) దృష్టి సారించామని, ఆలస్యం చేయకుండా త్వరలోనే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ( KC Venugopal ) స్పష్టం చేశారు. గురువారం నాడు సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశం గురించి ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘76 మంది నేతలు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. నాలుగు గంటల పాటు చాలా అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలు పార్లమెంటు అంశాలు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీడబ్ల్యూసీ తీర్మానాలు చేసింది. తెలంగాణలో ఏడాది క్రితం మేము మూడో స్థానంలో ఉన్నాం, అన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ఎన్నికలల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశించాం, కానీ ఓడిపోయాం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు ఎన్నికల ఫలితాల గురించి వివరించారు. మూడు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీకి నిరాశ కలిగించింది, కానీ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో బలంగా ఉంది మా ఓటు శాతం పదిలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడం ఆందోళన కలిగించడం లేదు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు ఈ నెలలోనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తాం’’ అని కేసీ వేణుగోపాల్ తెలిపారు.


మోదీ నియంతృత్వ పోకడులతో ఎంపీల సస్పెండ్

‘‘ఒకటి రెండు రోజుల్లోనే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తాం. లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుంది. దేశాన్ని ఒకే పార్టీ పాలించాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తోంది. మోదీ ప్రభుత్వం ప్రతిపక్షం ఉండకూడదని భావిస్తోంది. నియంతృత్వ పోకడులతో ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నాయి. కాంగ్రెస్- ఇండియా కూటమి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. డిసెంబర్ 28వ తేదీన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇది ఒక గుర్తుండిపోయే కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఐదు నుంచి పది లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరవుతారు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఇప్పటికే వర్కింగ్ కమిటీలకు సూచించాం. ఇండియా కూటమి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుంది’’ అని కేసీ వేణుగోపాల్ చెప్పారు.


అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

‘‘గెలుపే లక్ష్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడుతుంది. రెండో విడత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పడమరకు చేయాలని పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ జోడో రెండో విడతపై త్వరలోనే నిర్ణయం ఉంటుంది. ఇండియా కూటమి పార్టీలతోని పొత్తు కోసం ఏఐసీసీ ఇప్పటికే ఒక కమిటీ వేసింది. ఈ నెలలోనే పొత్తులపై చర్చలు ప్రారంభమవుతాయి. రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకొని ఇండియా కూటమి పార్టీలతోని పొత్తు గురించి ఏఐసీసీ పొత్తుల కమిటీ చర్చిస్తుంది. ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలను త్వరగా తీసుకోవాలని నిర్ణయించాం. కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం సూచించిన పేర్లను సీఈసీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారని మేము స్వాగతిస్తున్నాం’’ అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా.. రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు అయ్యే విషయంపై కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇవ్వలేదు.

Updated Date - Dec 21 , 2023 | 10:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising