ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

ABN, First Publish Date - 2023-07-22T10:05:32+05:30

మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.

Eknath Shinde

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.

అజిత్ పవార్ వర్గం తన ప్రభుత్వంలో చేరిన తర్వాత ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, ఈ పరిణామాలపై శివసేనలో ఎవరూ అసంతృప్తిగా లేరని చెప్పారు. తన వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేస్తున్నాయన్నారు.

అయితే అంతకుముందు షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కొందరు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం చేరడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు అజిత్ పవార్ మాట్లాడుతూ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రినవాలనేది తన కోరిక అని చెప్పారు. దీంతో షిండే వర్గంలో అసంతృప్తి బీజాలు పడ్డాయి. శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాకరే వర్గం చేసిన ఫిర్యాదుపై శాసన సభ సభాపతి నిర్ణయం ఇంకా వెలువడవలసి ఉంది.

బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఎన్‌సీపీ వర్గం జూలై రెండున చేరిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Terrorist Pannun : అమిత్ షా, జైశంకర్‌లకు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్ బెదిరింపులు

HD Kumaraswamy : కర్ణాటక ప్రయోజనాల కోసం జేడీఎస్ కీలక నిర్ణయం

Updated Date - 2023-07-22T10:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising