ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra : 512 కేజీల ఉల్లిపాయలు... 70 కి.మీ. ప్రయాణం... ఆ రైతుకు వచ్చిన లాభాలు వింటే అవాక్కవుతారు...

ABN, First Publish Date - 2023-02-24T13:06:26+05:30

ట్రేడర్ నాసిర్ ఖలీఫా మాట్లాడుతూ, గతంలో కూడా ఇదే విధంగా చిన్న మొత్తాలకు పోస్ట్ డేటెడ్ చెక్కులను జారీ చేశామన్నారు. మొత్తం ప్రక్రియను

Maharashtra Farmer Rajendra Tukaram
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్హాపూర్ (మహారాష్ట్ర) : ఆరుగాలం శ్రమించిన రైతు జీవనం అస్తవ్యస్తంగా ఉంది. ఎండ అనక, వాన అనక కష్టపడినా తగిన ఫలితం రావడం లేదు. పైగా వ్యవసాయం చేయడం పట్ల నిరాసక్తత కలుగుతోంది. అందరికీ అన్నం పెట్టే బాధ్యతను వదులుకొని, మరో వృత్తిలోకి వెళ్లిపోవాలనే ఆలోచనలు రగిలేలా పరిస్థితులు ప్రోత్సహిస్తున్నాయి. దీనికి ఓ ఉదాహరణ మహారాష్ట్రలోని బోర్గావ్ గ్రామ రైతు రాజేంద్ర తుకారామ్ చవాన్ (58) ఎదుర్కొన్న తాజా పరిణామం.

రాజేంద్ర తుకారామ్ ఉల్లిపాయలను సాగు చేశారు. 512 కేజీల ఉల్లిపాయలను 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీకి తీసుకెళ్ళారు. వాటిని కేజీ రూ.1 చొప్పున విక్రయించారు. కోతలు, తగ్గింపులు పోయిన తర్వాత ఆయనకు మిగిలిన లాభం కేవలం రూ.2.49. బ్యాంకు లావాదేవీల్లో పైసలను వదిలిపెడతారు కాబట్టి. కేవలం రౌండ్ ఫిగర్‌ను మాత్రమే పేర్కొంటారు కాబట్టి ఆయనకు వచ్చినది కేవలం రూ.2/-. ఇది కూడా పోస్ట్ డేటెడ్ చెక్కు రూపంలో ఆయన చేతికి వచ్చింది. ఈ రెండు రూపాయలను ఆయన 15 రోజుల తర్వాత బ్యాంకు నుంచి తీసుకోవడానికి వీలవుతుంది.

రాజేంద్ర తుకారామ్ మాట్లాడుతూ, గత ఏడాది కేజీ ఉల్లిపాయల ధర రూ.20 పలికిందని చెప్పారు. ప్రస్తుతం కేజీ ఉల్లిపాయలను రూ.1 చొప్పున ఏపీఎంసీ ట్రేడర్ నాసిర్ ఖలీఫా కొన్నారని చెప్పారు. తాను తీసుకొచ్చిన 512 కేజీల ఉల్లిపాయలకు రూ.512 వచ్చిందని, దీని నుంచి రూ.509.50లను హెడ్-లోడింగ్, వెయింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీల పేరుతో ట్రేడర్ తగ్గించారని తెలిపారు. ఈ పరిస్థితిలో ఆయన చాలా అసంతృప్తి, నిరాశతో కనిపించారు. గడచిన మూడు, నాలుగేళ్లలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు రెట్టింపు అయ్యాయని చెప్పారు. ఈ ఉల్లిపాయల సాగు కోసం తనకు రూ.40 వేల వరకు ఖర్చయిందన్నారు.

ట్రేడర్ నాసిర్ ఖలీఫా మాట్లాడుతూ, గతంలో కూడా ఇదే విధంగా చిన్న మొత్తాలకు పోస్ట్ డేటెడ్ చెక్కులను జారీ చేశామన్నారు. మొత్తం ప్రక్రియను కంప్యూటరైజ్డ్ చేసినందు వల్ల ఈ విధంగా జరుగుతుందన్నారు. రాజేంద్ర తుకారామ్ నాసిరకం ఉల్లిపాయలు తీసుకొచ్చారన్నారు. గతంలో ఆయన నాణ్యమైన ఉల్లిపాయలను తీసుకొచ్చారని, అప్పుడు కేజీ రూ.18 చొప్పున కొన్నామన్నారు. మరొకసారి కేజీ రూ.14 చొప్పున కొన్నామన్నారు.

కేంద్ర మంత్రికి లేఖ

రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ బోర్గావ్ గ్రామ పంచాయతీ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఉల్లిపాయలను సాగు చేసే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్ కూడా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఓ లేఖ రాశారు. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED) ద్వారా ఉల్లిపాయల సేకరణను పెంచాలని కోరారు. హోల్‌సేల్ ధరలను స్థిరీకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

UN General Assembly : ఉక్రెయిన్‌పై తీర్మానం... భారత్ కీలక నిర్ణయం...

Tomatoes : యూకేలో కొందామంటే దొరకని టమాటాలు... దీని వెనుకున్న అసలు కారణాలివీ...

Updated Date - 2023-02-24T13:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising