Maharashtra : రెండు కీలక వంతెనల పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-06-28T15:42:09+05:30
మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు ముఖ్యమైన వంతెనలకు పేర్లను మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్ వంతెనకు వీర్ సావర్కర్ సేతు అని నామకరణం చేసింది. అదేవిధంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు అని పేరు పెట్టింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావులేదన్నారు.
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు ముఖ్యమైన వంతెనలకు పేర్లను మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్ వంతెనకు వీర్ సావర్కర్ సేతు అని నామకరణం చేసింది. అదేవిధంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు అని పేరు పెట్టింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావులేదన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) గత నెలలో మాట్లాడుతూ, ముంబైలోని బాంద్రా-వెర్సోవా సీ లింక్‌కు సావర్కర్ పేరు పెడతామని చెప్పారు. ధైర్య, సాహసాలు ప్రదర్శించినవారికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న గాలంట్రీ అవార్డుల మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయిలో గాలంట్రీ అవార్డును సావర్కర్ పేరు మీద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar) 1883లో జన్మించారు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన విశేష కృషి చేశారు. బ్రిటిష్ పాలకులు ఆయనను 1910లో అరెస్ట్ చేసి, 50 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అండమాన్, నికోబార్ దీవుల్లోని కాలాపానీ సెల్యులార్ జైలులో నిర్బంధించారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) 1996 నుంచి 2004 మధ్య కాలంలో మూడుసార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
Rajya Sabha polls : మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జూలైలో
UCC Vs Congress : ఉమ్మడి పౌర స్మృతిపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు
Updated Date - 2023-06-28T15:42:09+05:30 IST