ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amit Shah Vs Mamata : అమిత్ షాపై మమత బెనర్జీ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-04-17T21:10:31+05:30

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన టీఎంసీ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Amit Shah , Mamata Banerjee
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన టీఎంసీ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) చెప్పడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అమిత్ షా శుక్రవారం (ఏప్రిల్ 14న) పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35 స్థానాల్లో బీజేపీ గెలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే, 2025 తర్వాత రాష్ట్రంలో మమత బెనర్జీ ప్రభుత్వం ఉండదని చెప్పారు.

ఈ నేపథ్యంలో మమత బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని అమిత్ షా మాటలను బట్టి తెలుస్తోందన్నారు. హోం మంత్రి ఓ గూండా మాదిరిగా మాట్లాడకూడదన్నారు. అమిత్ షా అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడారన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడినందుకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదన్నారు. 2024లో జరిగే ఈ ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రతిపక్షాలను కోరారు.

మమత బెనర్జీ ప్రభుత్వ పదవీ కాలం షెడ్యూలు ప్రకారం 2026 వరకు ఉంది.

ఇవి కూడా చదవండి :

Same-sex marriage : స్వలింగ వివాహాలపై పిటిషన్లను తోసిపుచ్చండి.. సుప్రీంకోర్టును కోరిన కేంద్రం..

PM Modi : కుల గణనపై మోదీకి ఖర్గే లేఖ

Updated Date - 2023-04-17T21:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising