Minister: ఆ పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం
ABN , First Publish Date - 2023-03-15T10:04:18+05:30 IST
తమిళం పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించేలా చర్యలు చేపడతామని యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయ
పెరంబూర్(చెన్నై): తమిళం పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించేలా చర్యలు చేపడతామని యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) తెలిపారు. రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన లాంగ్వేజ్ పరీక్షకు సుమారు 50 వేలమంది విద్యార్థులు హాజరుకాలేదు. పరీక్షకు విద్యార్థులు ఎందుకు హాజరుకాలేదో తెలియజేయాలని జిల్లా విద్యాధికారులకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెరంబలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని మంగళవారం మంత్రి ఉదయనిధి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోమవారం నిర్వహించిన ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో తమిళ పరీక్షకు హాజరుకాలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ మంత్రిని కోరనున్నామని తెలిపారు.