ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడు: మంత్రి, మా కుటుంబమంతా ఎన్టీఆర్‌ అభిమానులమే: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2023-09-06T10:45:21+05:30

తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu)

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu) నేటి యువతరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడని, ఆయన మేధస్సు మహా అద్భుతమని బళ్లారి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బి.నాగేంద్ర(in-charge Minister B. Nagendra) పేర్కొన్నారు. కమ్మమహాజన సంఘం అధ్యక్షుడు ముండ్లూరు అనూఫ్‌ కుమార్‌, కమ్మసంఘం కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో కమ్మభవనంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నాగేంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. 1999లో ఆయన బళ్లారికి వచ్చారని, ఇప్పడు రావడం రెండోసారి అన్నారు. చంద్రబాబు ఆలోచనలు, ఆయన నడవడిక మహా అద్భుతం అన్నారు. బళ్లారి నగర కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి మాట్లాడుతూ... తమ కుటుంబమంతా ఎన్టీఆర్‌ అభిమానులమని తెలిపారు.

చంద్రబాబు తమ లాంటి యువకులకు రాజకీయ మార్గదర్శి అన్నారు. కర్ణాటకలో ఎస్‌ఎం కృష్ణ, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాష్ట్రాల అభివృద్ధి కోసం శ్రమించిన గొప్ప నాయకులని కొనియాడారు. కార్యక్రమంలో కమ్మ సంఘం నాయకులు ప్రభాకర్‌ నాయుడు, దా మోదర్‌ చౌదరి, కొత్తపల్లి తిమ్మరాజు, లాల్‌మోహన్‌, డి. పుల్లయ్య, రాయంకి రమానాయుడు, బుడుగు నాగేశ్వరరావు, కె.చెన్నప్ప, న్యాయవాది కోటేశ్వరావు, విజయ్‌ కుమార్‌, ఉమేష్‌, అభిలాష్‌ శ్రీనివాస్‌, కాండ్రా మురళీ, పయ్యావుల శ్రీనివాసులు, కాకర్ల తోట విజ్జీ, బెస్టు స్కూల్‌ రామప్ప, వెంకట క్రిష్ణ, కొనంకి తిలక్‌, ఆంజనేయు, రామాంజినేయులు, ముల్లంగి నందీష్‌, ముండ్లూరు ప్రభంజన్‌, ముండ్లూరు రమేష్‌ బాబు, విక్కీ, శివప్ప, తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలు, క్యాంపులు నుంచి వచ్చిన వేలాది మందికి కమ్మభవనంలో భోజన వసతులు కల్పించారు.

Updated Date - 2023-09-06T10:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising