MP Cabinet expansion: మంత్రివర్గంలోకి దిగ్గజనేతలు కైలాష్ విజయవర్గీయ, ప్రహ్లాద్ పటేల్
ABN , Publish Date - Dec 25 , 2023 | 04:43 PM
మధ్యప్రదేశ్ మంత్రివర్గాన్ని తొలిసారిగా సోమవారంనాడు విస్తరించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో కైలాష్ విజయవర్గీయ, ప్రహ్లాద్ పటేల్ సహా 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 19 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు. ఎంపీ దిగ్గజాలైన ప్రద్యుమ్న్ సింగ్ తోమర్, విశ్వాస్ సారంగ్‌లు కూడా కొత్త మంత్రివర్గంలో చేరారు.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) తొలిసారిగా సోమవారంనాడు విస్తరించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో కైలాష్ విజయవర్గీయ, ప్రహ్లాద్ పటేల్ సహా 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 19 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు. ఎంపీ దిగ్గజాలైన ప్రద్యుమ్న్ సింగ్ తోమర్, విశ్వాస్ సారంగ్‌లు కూడా కొత్త మంత్రివర్గంలో చేరారు.
క్యాబినెట్‌లోకి...
సీఎం మోహన్ యాదవ్ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కిన వారిలో విజయ్ షా, కరణ్ సింగ్ వర్మ, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్, సంపతియా ఉయికి, తులసీరామ్ సిలావత్, అయిదల్ సింగ్ కాన్సానా, గోవింద్ సింగ్ రాజ్‌పుట్, విశ్వాస్ సారంగ్, గౌతమ్ టెట్వాల్, నారాయణ్ సింగ్ పన్వార్, నరేంద్ర శివాజీ పటేల్, నిర్మలా భురియా, నారాయణ్ సింగ్ కుష్వాహ, నగర్ సింగ్ చౌహాన్, ప్రద్యుమ్న సింగ్ తోమర్ తదితరులు ఉన్నారు. కాగా, 230 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో మంత్రివర్గ సభ్యుల సంఖ్య సీఎంతో కలిసి 35 మంది వరకూ ఉండవచ్చు. డిసెంబర్ 13న సీఎంగా మోహన్ యాదవ్, ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవ్డా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది.