JP Nadda on Sanaathana Dharma:సనాతన ధర్మాన్ని అగౌరవపరచడమే ఇండియా కూటమి పని
ABN, First Publish Date - 2023-09-15T21:59:05+05:30
సనాతన ధర్మాన్ని అగౌరవరచడమే లక్ష్యంగా ఇండియా కూటమి పని చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో బీజేపీ 'పరివర్తన్ యాత్ర' (మార్చ్ ఫర్ చేంజ్)లో ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ లక్ష్యంగా చేసుకుని నడ్డా పదునైన విమర్శలు చేశారు.
సనాతన ధర్మాన్ని అగౌరవరచడమే లక్ష్యంగా ఇండియా కూటమి పని చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో బీజేపీ 'పరివర్తన్ యాత్ర' (మార్చ్ ఫర్ చేంజ్)లో ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ లక్ష్యంగా చేసుకుని నడ్డా పదునైన విమర్శలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
సనాతన ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, అగౌరవపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఛత్తీస్ ఘడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
Updated Date - 2023-09-15T21:59:05+05:30 IST