ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagaland Assembly Election Results 2023 : నాగాలాండ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్!

ABN, First Publish Date - 2023-03-02T11:57:21+05:30

నాగాలాండ్ శాసన సభ ఎన్నికల ఫలితాల (Nagaland Assembly Election Results 2023) సరళినిబట్టి చూస్తే ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి

Dy CM Yanthungo Patton, Nagaland BJP chief Temjen Imna Along
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : నాగాలాండ్ శాసన సభ ఎన్నికల ఫలితాల (Nagaland Assembly Election Results 2023) సరళినిబట్టి చూస్తే ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 60 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీపీపీ 26, బీజేపీ 11, కాంగ్రెస్ 2, ఎన్‌పీఎఫ్ 1, ఇతరులు 20 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ఇదిలావుండగా, బీజేపీ నాగాలాండ్ శాఖ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ వెనుకంజలో కనిపిస్తున్నారు. ఆయన అలోంగ్టకి నియోజకవర్గంలో జనతాదళ్ యునైటెడ్ పార్టీ అభ్యర్థి జే లను లోంగ్చర్ కన్నా వెనుకబడి ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రముఖ నేతల్లో టెమ్జెన్ ఒకరు. ఆయన సోషల్ మీడియా సెన్సేషన్ కూడా. నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి వై పట్టోన్ 110 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఎన్‌డీపీపీ అధినేత, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి సెయీవిల్లీ సచు కన్నా 6,394 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

ఎన్నికల కమిషన్ ప్రకటన ప్రకారం, నాగాలాండ్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీపీపీ అభ్యర్థులు 18 స్థానాల్లోనూ, బీజేపీ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. బీజేపీ 1 స్థానంలో విజయం సాధించింది, 8 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ, ఎన్‌పీపీ చెరొక రెండు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నాయి. లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 3, ఎన్‌సీపీ 5, ఆర్‌పీఐ (అథవాలే) 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్, స్వతంత్రులు చెరొక స్థానంలో ఆధిక్యంలో కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Tripura Assembly Elections Results 2023 : త్రిపురలో బీజేపీ కూటమి ముందంజ... సుదూరంగా కాంగ్రెస్-వామపక్షాలు...

Meghalaya, Nagaland and Tripura : మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత?

Updated Date - 2023-03-02T11:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!