ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan Election 2023: ఎన్నికల ప్రచారంలో మోదీ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2023-11-20T17:41:57+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మరో బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రభుత్వం ఏటా రూ.12,000 ఇస్తుందని ప్రకటించారు.

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల (Rajasthan Assembly Election) ప్రచారంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ (BJP) అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పటికే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎల్పీజీ సబ్సిడీ ఆఫర్‌ను ప్రకటించిన బీజేపీ మరింత దూకుడు పెంచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మరో బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kian Samman Nidhi) కింద రైతులకు ప్రభుత్వం ఏటా రూ.12,000 ఇస్తుందని ఆయన ప్రకటించారు.


రాజస్థాన్ బీజేపీ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తుందని, దీనికి అదనంగా బోనస్‌ ఇస్తుందని భరోసా ఇచ్చారు. రాజస్థాన్‌లో అధికంగా ఉన్న పెట్రోల్ ధరలపై బీజేపీ అధికారంలోకి వస్తే సమీక్ష జరుపుతుందని కూడా హామీ ఇచ్చారు. పేదలను మోసం చేసేవాళ్లను కటకటాల వెనక్కి పంపుతామన్నారు. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-11-20T17:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising