ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra : జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం.. శరద్ పవార్, నితిన్ గడ్కరీ భేటీ..

ABN, First Publish Date - 2023-04-01T18:34:19+05:30

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari), ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారం

Nitin Gadkari, Sharad Pawar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై : కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari), ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారం నాగపూర్‌లో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని ఇరువురి సన్నిహితులు చెప్తున్నారు. కానీ శ్రీరామ నవమి సందర్భంగా శంభాజీ నగర్‌లో జరిగిన హింసాకాండ నేపథ్యంలో మహారాష్ట్ర అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రంగా ఉన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

నితిన్ గడ్కరీ సన్నిహితుడొకరు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, వసంత్ దాదా సుగర్ ఇన్‌స్టిట్యూట్ శాఖను విదర్భ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని, దానికోసం స్థలాన్ని పరిశీలించేందుకు శరద్ పవార్ వచ్చారని తెలిపారు. ఈ ప్రాంతంలోని చెరకు రైతులకు సహాయపడటం కోసం గడ్కరీ కోరిక మేరకు ఈ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టారన్నారు. ఎన్‌సీపీ ప్రతినిధులు కూడా ఇరువురు నేతలు అభివృద్ధికి సంబంధించిన విషయాలనే మాట్లాడుకున్నారని చెప్పారు.

శరద్ పవార్ విదర్భ (Vidarbha) ప్రాంతంలో రెండు రోజులపాటు పర్యటించేందుకు ఇక్కడికి వచ్చారు. ఆయనతోపాటు ఎన్‌సీపీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, అనిల్ దేశ్‌ముఖ్, దిలీప్ వాల్సే-పాటిల్ ఉన్నారు.

ఇదిలావుండగా, మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నాగపూర్‌లోనే ఉన్నప్పటికీ, పవార్-గడ్కరీ సమావేశంలో పాల్గొనలేదు. ఫడ్నవీస్ కార్యాలయంలోని కొందరు మాట్లాడుతూ, శనివారం ఉదయం నుంచి ఫడ్నవీస్‌కు అనేక సమావేశాలు ఉన్నాయని, పవార్-గడ్కరీ సుగర్ ఇన్‌స్టిట్యూట్ గురించి మాట్లాడుకున్నారని, అందువల్ల ఉప ముఖ్యమంత్రి ఈ సమావేశానికి హాజరవవలసిన అవసరం లేదని చెప్పారు.

ఇదిలావుండగా, గడ్కరీ ప్రతిపక్ష నేతలకు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఎన్‌సీపీ (NCP), శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ (MNS) నేతలు నాగపూర్ వెళ్లినపుడు, వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి :

Hindus in danger : బీజేపీ ఆరోపణలపై మహువా మొయిత్రా మండిపాటు

IndiGo : ఇండిగో సిబ్బందిపై దాడి.. స్వీడిష్ జాతీయుడి అరెస్ట్..

Updated Date - 2023-04-01T18:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising